30, సెప్టెంబర్ 2013, సోమవారం

ఎనర్జీ డ్రింకులతో శక్తి వస్తుందా?

ఎనర్జి డ్రింక్స్‌. ఈ పేరు వినగానే స్టామినా పేరిట, ఎనర్జీ పేరిట క్రీడాకారుల దగ్గర్నుండి సామాన్య యువతీ యువకుల దాకా క్రేజ్‌తో తాగుతున్న ఆకర్షణీయమైన రంగురంగుల లేబుల్స్‌ ఉన్న బాటిల్స్‌ గుర్తుకొస్తున్నాయి కదూ ! ఈ ఎనర్జి డ్రింక్స్‌ నిజంగా మనకి...............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండి http://bit.ly/19ayuGN

చెవికి మైక్రో ఇయర్‌ సర్జరీ ఎప్పుడు అవసరం?

చెవిలో నొప్పిగా ఉంటేనే డాక్టరును సంప్రదిస్తుంటాం. అందరూ అశ్రద్ధ చూపే అవయవం చెవి. అయితే కొన్ని వ్యాధులు నొప్పితో ప్రమేయం లేకుండానే చెవిని తినేస్తుంటాయి. దీంతో చెవి చేయాల్సిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించలేని.......మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/1fV6t7p

ప్రథమ చికిత్స అంటే ?

కస్మాత్తుగా ప్రమాదం సంభవించినప్పుడు గాని, జబ్బు చేసినప్పుడు గాని, ప్రమాదంలో వ్యక్తి మరణించకుండా, జబ్బు తీవ్రం కాకుండా డాక్టరు దగ్గరకు వెళ్లే ముందు అందించే...........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/19Ot7JM

29, సెప్టెంబర్ 2013, ఆదివారం

గుండెపై మానసిక ఒత్తిడి ప్రభావం

ప్రస్తుత కాలంలో మానసిక ఒత్తిడి అనేది చాలా సాధారణంగా ఉపయోగించే పదంలా తయారైంది. ఒత్తిడి బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చిన్న వయసులోనే...........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/18gMdsz

ఆరోగ్యవంతమైన గుండెకు బాటలు ఇలా వేద్దాం…..

కార్డియోవాస్క్యులర్‌ డిసీజ్‌ (సివిడి) అన్ని వయసుల వారిని, మహిళలు, పిల్లలతోసహా అందరినీ ప్రభావితం చేస్తోంది. ఈ రోజు ప్రపంచ హృదయ దినం. ఈ సందర్భంగా వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ సభ్యులతో కలిసి ఒక పిలుపునిచ్చింది. వ్యక్తులు, తల్లిదండ్రులు తమంతట తాము గుండెజబ్బు, పక్షవాతం వచ్చే ముప్పును తగ్గించుకోవడమే కాక, కుటుంబానికి వచ్చే ముప్పును ............ మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/1fTlcQb

ఇదీ ఆరోగ్యమైన గుండెకు బాట


ఈ రోజూ వరల్డ్‌ హార్ట్‌డే (ప్రపంచ హృదయదినం). ప్రపంచ ఆరోగ్యస సంస్థ, వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ దీన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుతాయి. ప్రతీ ఏడాది ఒక్కో నినాదాన్ని ఇస్తుంది. ఈ ఏడాది మహిళలు, పిల్లలపై దృష్టిసారించింది. గుండెరక్తనాళాల జబ్బు (కార్డియోవాస్క్యులర్‌ డిసీజ్‌)ను నివారించి,......మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/1991lv9

ఆరోగ్యమైన గుండెకు 8 ఆహార పద్ధతులు

పురుషులు, మహిళల మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి గుండె జబ్బు. అంటే దీనర్థం మిమ్మల్ని మీరు రక్షించుకోలేరని అర్థం కాదు. మీరు రోజూ చేసే వ్యాయామంతోపాటు తినే ఆహారాపదార్థాల గురించి శ్రద్ధ పెట్టాల్సిందే. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోకూడదో కూడా తెలుసుకోవాలి. దీని వల్ల కొలెస్ట్రాల్‌ శాతం తగ్గుతుంది, రక్తపోటు.....మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/18fPM28

గుండె జబ్బు నివారణ సాధ్యమే

జీవిత కాలమంతా మనిషిని కాపాడే గుండెకు ఆపదలో ఉంది. అంటే మనిషి గుండె జబ్బులను కొనితె చ్చుకుంటున్నాడు. దీనికి జన్యుపరమైన కారణం ఒకటైతే, అస్థవ్యస్థమైన జీవనశైలి మరొకటి. గుండె జబ్బులు చాలా రకాలు. అయితే 80 శాతం గుండె జబ్బులను....................మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండి http://bit.ly/1658gDe

చిన్న కోతతో బైపాస్‌ సర్జరీ

గుండెలోని రక్తనాళాలు పూడుకుపోయి, అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెకు రక్తప్రసరణ తగ్గుతుంది. గుండెకు రక్త ప్రసరణను పునరుద్ధరించడానికి లేదా రక్తప్రసరణను పెంచడానికి చేసే శస్త్రచికిత్సను బైపాస్‌ సర్జరీ అంటారు. గుండె శస్త్రచికిత్సలో అనేక...............మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిhttp://bit.ly/15Cgx2X

గుండెపోటును తప్పించే యాస్ర్పిన్‌

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మానవుని జీవితంలో అనేక మార్పులు తెచ్చింది. మానవ జీవన శైలిలో వచ్చిన మార్పులు అందులో భాగమే. అభివృద్ధి చెందిన దేశాల్లోనే కాకుండా అభివృద్ధి చెందుతున్న మన లాంటి దేశాల్లో కూడా ఈ మార్పులు శరవేగంగా వస్తున్నాయి. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు లాంటి రుగ్మతలు అధికం కావడానికి........మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండిbit.ly/15Cg9BG

గుండెపోటు – కొన్ని వాస్తవాలు

గుండె చాలా ప్రధానమైన భాగమని తెలిసిందే. అది పనిచేయటం మానేస్తే మనిషి చనిపోయినట్టేనని డాక్టర్లు ఎప్పుడూ చెబుతున్నమాట. మారుతున్న జీవన శైలితో గుండెపోటుతో మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండి bit.ly/1bSgkuo

గుండెను కాపాడుకుందాం ఇలా…..

సెప్టెంబర్‌ 29 ప్రపంచ హృదయ దినం. మనిషి శరీర భాగాల్లో గుండె ప్రధానమైందని అందరికీ తెలుసు. తెలియవలసిందల్లా దాన్ని ఎలా రక్షించుకోవాలన్నదే. పెరుగుతున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం మానవుని జీవితంలో అనేక మార్పులు తెచ్చింది. అభివృద్ధి చెందిన దేశాల్లోనే కాక అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాల్లో కూడా ఈ మార్పులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఊబకాయం,మధుమేహం..మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండి bit.ly/1988j3D

కొలెస్ర్టాల్‌ తగ్గించుకో గుండెపోటు నివారించుకో

మన జీవనశైలి మారింది. దీంతో మనకు వచ్చే జబ్బుల తీరు కూడా మారింది. కాలాను గుణంగా మన జీవన వేగం పెరిగింది. ఫలితంగా మనకు సంక్రమించే కొత్త జబ్బుల వేగం కూడా పెరిగింది. కొత్త జబ్బుల వేగం పెరగడంతోపాటు పాతజబ్బుల తీవ్రతా పెరిగింది. ఊబకాయం, షుగర్‌, బీపి, కొలెస్ట్రాల్‌ వంటి జబ్బులు......మరింత చదవడానికి ఇక్కడ క్లిక్‌  చేయండి http://bit.ly/19fbKPX

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఆరోగ్యం మన వంటింట్లోనే


 వంటగదుల్లోని మసాల దినుసుల్లో అద్భుతమై నది పసుపు. ఇది కేవలం రుచికే కాక, ఆహారపదార్థానికి రంగువచ్చేలా చేస్తుంది. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంతేకాక పసుపు వంటకాల్లో వాడటం వెనుక కొందరికి సెంటిమెంట్‌ కూడా వుంది.
4000 ఏళ్ల సంవత్సరాల క్రితం పసుపు వినియోగం గురించి వేదాల్లో రాశారు. అన్ని రకాల భారత వంటకాల్లో తప్పనిసరిగా ఉండేది చిటికెడు పసుపు. ఇది గాయాలను మాన్పుతుందని భావిస్తారు.
మన ఇళ్లల్లో పసుపును శుభప్రదమైనదిగా భావిస్తారు. పెళ్లి కార్డులు పంచేముందు, వీటికి నాలుగువైపుల పసుపు రాసి ఇస్తారు. ఎందు కంటే సంతోషానికి, అదృష్టానికి చిహ్నమని పసుపుపూస్తారు. ఇక ఒడిసాల్లో దీన్ని మరో విధంగా పరిగణిస్తారు. తమ ఆత్మీయులు ఎవరై నా చనిపోతే, పదిరోజులపాటు పసుపు లేకుండా ఆహారాన్ని తీసుకోవడం ఆచారమట. ఆత్మీయు లు కోల్పోయారనడానికి, విషాదానికి గుర్తుగా పసుపులేని ఆహారం తీసుకుంటారు. శాఖాహార మైనా, మాంసాహారమైన పసుపులేని ఆహార పదార్థాలు ఉండవనే చెప్పాలి. ఊరగాయల్లో పసుపు ఒక భాగంగా మారింది. పసుపురంగు పచ్చడికి మంచి రంగును, రుచినీ ఇస్తుంది.
సాధారణ పప్పు వంటకాల్లో చిటికెడు ఉప్పు, పచ్చి మిరపకాయల వల్ల మంచి రుచి వస్తుంది. కిచిడీకి పసుపు రంగు కలపడం ఆనవాయితీ. పసుపు పెరిగే మొక్కను 'హల్దీ' అంటారు. ఇది మన దేశంలో చాలా ప్రాంతాల్లో పెరుగుతుంది. తాజా పసుపు మొక్కలు చిన్న అల్లం మొక్కల్లాగా కనిపిస్తాయి.
వంటల్లోనేకాక పసుపును వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఇందులో 'ఫ్లెవనాయిడ్‌ కుర్కుమిన్‌' ఉంటుంది. దీనికి యాంటి- ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇది కాలేయాన్ని విషరహితంగా చేస్తుంది. అలర్జీలపై పోరాడు తుంది. జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మహిళలు పసుపు ముద్దతో స్నానం చేయడం మన సాంప్రదాయం. పసుపు నూనె వల్ల చర్మరోగాలు కూడా నయమవుతాయి.
బరువును తగ్గించే గుడ్డు !
బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఉదయం టిఫిన్‌లో గుడ్డు తినాలి. గుడ్లు తినడం వల్ల కలిగే ప్రభావాల గురించి అధ్యయనాలు జరిగాయి. వీటిని విశ్లేషించారు. గడ్డులో ఉండే శక్తివంతమైన పదార్థం మధ్యాహ్నం, రాత్రి భోజనం ఎక్కువ కేలరీలు తీసుకోకుండా నిలువరిస్తుందని ఇందులో కనుగొన్నారు. ఇతర పద్ధతుల్లో కాకుండా గుడ్డును ఉడకబెట్టడం, వేయించడం, గిలకొట్టడం వంటి రూపాల్లో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మధ్యాహ్నం ఆకలేసినప్పుడు బిస్కెట్లు, కేకులు, చాక్లెట్లు తినకుండా గుడ్డు నిలువరిస్తుంది. ఈ విశ్లేషణ 'నెట్‌వర్క్‌ హెల్త్‌ డైటీషియన్‌' అనే పత్రికలో ప్రచురితమైంది. ఇతరరకాల కంటే గుడ్డులో ఉండే ప్రత్యేకమైన ప్రోటీన్లు ఆకలి కలగకుండా చేస్తాయని కనుగొన్నారు. ఎనిమిదేళ్లపాటు జరిగిన అధ్యయన ఫలితాలను పోషకాహార నిపుణులు డాక్టర్‌ క్యారీ రక్సటన్‌ పరీక్షించారు. ఉదయం టిఫిన్‌లో తృణధాన్యాలు తీసుకోవడం కన్నా గుడ్డును తినడం వల్ల బరువు గణనీయంగా తగ్గడమేకాక, నడుం భాగంలో కొన్ని అంగుళాలను కోల్పోయారని, సుధీర్ఘకాలం పాటు జరిగిన అధ్యయనం వెల్లడించింది. 'గుడ్డు

వల్ల కలిగే సుదీర్ఘ ప్రయోజనాల గురించి మరింత పరిశోధన చేయాల్సి ఉంది. బరువు తగ్గడంలో గుడ్డు పాత్రను విస్మరించలేమని ఆధారాలు చూపుతున్నాయి' అని డాక్టర్‌ రక్సటన్‌ అంటారు. గుడ్డు వల్ల బరువు తగ్గడమేకాక, అదనంగా మరో రెండు ప్రయోజనాలు న్నాయని రక్సటన్‌ తెలిపారు. ఒక గుడ్డులో 78 కేలరీలు ఉంటాయి. ఇంక రెండోది గుడ్డులో ఉండే విటమిన్‌-డి. స్థూలకాయులకు ఇది ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే స్థూలకాయుల్లో విటమిన్‌-డి తక్కువుంటుంది. ఇది తక్కువ ఉండట వల్ల, మధుమేహం, గుండె జబ్బు ప్రమాదం పెరుగుతుంది. సగటున ఒక గుడ్డులో అత్యధిక ప్రోటీన్లు-6.5 గ్రాములు ఉంటాయి. పెద్ద వాళ్లకు ఒక రోజుకు అవసరమైన ప్రోటీన్లలో ఇది 13 శాతం.

పోషక విలువలు - జాగ్రత్తలు

రకరకాల ఐరన్‌, క్యాల్షియం, మల్టీ విటమిన్‌ మాత్రలు, టానిక్‌లు వాడే బదులు మంచి ఆహారం తీసుకోవడం అవసరం. ఎందుకంటే రకరకాల ఆహార పదార్థాల్లోనే మన దేహానికీ, ఆరోగ్యానికీ అవసరమైన అన్ని రకాల పోషక విలువలూ లభిస్తాయి. ఆహార పదార్థాలను వండేటప్పుడు పోషక విలువలు పోకుండా జాగ్రత్తలు తీసుకోవడం మరీ ముఖ్యం.
విడిగా పాత్రలలో వండడం కంటే ప్రెషర్‌ కుక్కర్‌లో వండడం వల్ల పోషక విలువలు పరిరక్షించబడతాయి. విడిగా వండితే అవి ఆవిరి రూపంలో వెళ్లిపోతాయి. విడి పాత్రలలో వండితే మూతలు పెట్టి వండాలి.
ఆకుకూరలు, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ, దోసకాయ వంటి సహజంగా నీరు ఉండే కూరగాయలను తక్కువ నీళ్లు పోసి వండాలి. వీటిలో సహజంగా ఉండే నీళ్లే ఇవి ఉడకడానికి సరిపోతాయి.
కూరగాయలను, ఆకుకూరలను ముందే శుభ్రంగా కడిగిన తర్వాత తరగాలి. తరిగిన తర్వాత కడిగితే వాటిలోని విటమిన్లు నీళ్లలో కలిసి వెళ్లిపోతాయి.
కూరగాయలు, ఆకుకూరలను మరీ చిన్న ముక్కలుగా గాక ఉడకడానికి అనువుగా వుండే వరకూ పెద్ద పెద్ద ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు అయితే వాటి లోపల పోషక విలువలు తగ్గిపోతాయి.
కూరముక్కలు మరీ చితికిపోయే వరకు ఉడికించకూడదు. ఎక్కువ ఉడికే కొద్దీ విటమిన్లు చచ్చిపోతాయి. ముక్కలు తినడానికి అనువుగా వుండే వరకూ మాత్రం ఉడికిస్తే చాలు.
రెండు మూడు రకాల కూరగాయల కాంబినేషన్‌లో కూరలు చేసుకోనేప్పుడు ఎక్కువగా ఉడకాల్సిన వాటిని ముందుగా ఉడికించుకుని, తర్వాత త్వరగా ఉడికిపోయే వాటిని వేసుకోవాలి. అన్ని ఒకేసారి వేస్తే త్వరగా ఉడికిపోయే వాటిలో పోషకాలు తగ్గిపోతాయి.
వండిన పదార్థాను ఫ్రిజ్‌లో పెట్టుకుని, మళ్లీ వేడి చేసుకుని తినకూడదు. మళ్లీ మళ్లీ ఉడికించే కొద్దీ పోషక విలువలు తగ్గిపోతాయి. ఆహారం వండిన వెంటనే తినాలి.

కొలెస్ట్రాల్‌కు దూరంగా...

ఈ రోజుల్లో చాలా మందికి కొలెస్ట్రాల్‌ భయం పట్టుకుంది. గుండె జబ్బులు రావడానికి కొలెస్ట్రాల్‌ ముఖ్యకారణం అవుతోంది. కొలెస్ట్రాల్‌కు దూరంగా ఉండాలంటే ఇలా చెయ్యాలి...
వంటకాలలో డాల్డాతో పదార్థాలు తయారు చేసుకోవడం తగ్గించాలి. నాన్‌స్టిక్‌ పాన్‌ వాడితే కూరల్లో నూనె తక్కువ వేసినా సరిపోతుంది. కూరలను ఆవిరి మీద ఉడికించి తినడం మంచిది.
కూరలలో నూనె వాడకం వీలైనంత తగ్గించాలి. నూనెలో ముంచి తీసే బజ్జీల లాంటి పిండి వంటలు వద్దు. ఎప్పుడూ ఒకే రకం నూనె కాకుండా రెండు రకాల ఆయిల్స్‌ కలిపి వాడితే మంచిది.
జీడిపప్పు, వేరుసెనగ పప్పు లాంటివి వీలైనంత తగ్గించాలి. కాయగూరలు, పండ్లు వీలైనంత ఎక్కువగా తినాలి. ఇక, తృణధాన్యాలు ఎక్కువగా, పప్పు ధాన్యాలు కొంత పరిమితంగా తీసుకోవాలి.
రోజూ రెండు మూడు పచ్చి వెల్లుల్లి రేకులు, ఒక ఉల్లిపాయ తినవచ్చు. నూనెలో చేసే పూరీల కన్నా నూనె లేకుండా చేసే పుల్కాలు తినాలి.
గుడ్లు, పచ్చళ్ళు, అప్పడాలు, స్వీట్స్‌, కేకులు, పిజ్జాలు, చాక్లెట్లు చాలా తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయవచ్చు, హోల్‌మిల్క్‌ బదులు కొవ్వు తీసేసిన మిల్క్‌ తాగాలి. వెన్న, నెయ్యి వాడవద్దు.
పాలతో చేసిన పదార్థాలు వీలైనంత తగ్గించాలి. మొలకెత్తే విత్తనాలు, పండ్లు బాగా తినవచ్చు.

ఈ రెంటినీ కలిపి తింటే మేలు..

పసుపు-సాల్మన్‌
యాంటి-ఇన్‌ఫ్లమేటరీ, గాయాలను నయం చేసే గుణాలు పసుపులో ఉన్నాయి. సాల్మన్‌లో (ఒక రకమైన సముద్రపు చేప) పిండిపదార్థాలు తక్కువ, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తింటే- సాల్మన్‌లో ఉండే ఓమెగా-3 ఫ్యాటి ఆసిడ్లు ఊపందు కుంటాయి. ఇది నాడీవ్యవస్థను సంరక్షిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌-హెచ్‌డిఎల్‌ను పెంచుతుంది. ధమనుల్లో చెడుకొలెస్ట్రాల్‌ తొలగిపోవడంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ కణాలు పెరగవు, ఫలితంగా కణతి వృద్ధి చెందడం నెమ్మదిస్తుంది.
తృణధాన్యాలు-ఉల్లిపాయలు
తృణధాన్యాలు-మొక్కజొన్న, పాలిష్‌పట్టని బియ్యం, బార్లీ, గోధుమల్లో వివిధ ప్రమాణాల్లో ఐరన్‌, జింక్‌ ఉంటాయి. ఈ రెండు ఖనిజాలు శరీరంలో శోషణ కావాలంటే ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్‌ ముఖ్యం.
చిక్కుళ్లు- కూరగాయలు
చిక్కుళ్లలో అధికంగా ప్రోటీన్లు, ఐరన్‌ ఉంటాయి. వీటిని పాలకూర, మొలకలు, బంగాళదుంపలతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. ' మన శరీరం పిండి పదార్థాలు, కొవ్వుల కంటే ప్రోటీన్ల జీవక్రియకు మూడు రెట్లు ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది' అని షీలా అంటారు. చిక్కుళ్లు, కూరగాయలు కలిపి తీసుకోవడంవల్ల బరువు పెరగడాన్ని నివారించొచ్చు. చిక్కుళ్లలోని ఐరన్‌ శోషణకు కూరగాయల్లోని విటమిన్‌-సి సహకరిస్తుంది.
టమాట-ఆలివ్‌నూనె
టమాటాలో విటమిన్‌-సి, లైకోపీన్‌ అనే యాంటిఆక్సిడెంట్‌ గణనీయమైన పరిమాణంలో ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్లు వృద్ధాప్య ప్రభావాలను, క్యాన్సర్‌ను, ఆస్టియోపోరొసిస్‌ (బోలు ఎముకల వ్యాధి), క్యాటరాక్ట్‌ (శుక్లాల వ్యాధి) వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆలివ్‌ ఆయిల్‌లో కూడా అధికంగా యాంటి ఆక్సిడెంట్లుంటాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ ఏర్పడటాన్ని ప్రోత్సాహిస్తాయి. ఆలివ్‌నూనె సమక్షంలో లైకోపీన్‌ ఉత్తమంగా శోషణ చెందుతాయి. అంతేకాక ఆలివ్‌నూనె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధిచేయడమేకాక, పిత్తాశయంలోని రాళ్లను కరిగిస్తుంది. ఇవి రెండూ, కాలేయ పనితీరును మెరుగుపరచడమే కాక, శరీరాన్ని విషరహితంగా చేస్తుంది. అధిక రక్తపోటు వల్ల కలిగే ప్రభావాలను తగ్గిస్తుంది.

బాబుకు ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్... ఏం చేయాలి?

  మా బాబుకు ఏడేళ్లు. అతడికి రెండున్నర సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. దాంతో స్పెషాలిటీ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లాం. చాలారోజులు అబ్జర్వేషన్‌లో ఉంచి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఇంటస్ట్టీషియల్ లంగ్ డిసీజ్ అని చెప్పారు. అప్పట్నుంచి వాడికి సమస్య వచ్చినప్పుడు తీవ్రంగా ఆయాసపడుతూ డొక్కలెగరేస్తూన్నాడు. ఇలా సమస్య వచ్చినప్పుడల్లా అక్కడికే తీసుకెళ్తున్నాం. వారు అక్కడ స్టెరాయిడ్స్‌తో చికిత్స చేసి, మెరుగుపడ్డ తర్వాత డిశ్చార్జి చేస్తున్నారు. ప్రతి నెలా తీసుకెళ్లి చూపిస్తున్నాం. గతేడాది పరిస్థితి బాగానే ఉండటంతో ఈ నెలలో ఫాలో అప్‌కు తీసుకెళ్లడంలో కాస్త ఆలస్యం అయ్యింది. దాంతో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వెంటవెంటనే జబ్బు తిరగబెట్టింది. మా వాడి సమస్యకు పరిష్కారం ఏమిటి?  మాకు తగిన సలహా ఇవ్వండి.
 - ఎ.పి. సురేశ్ కుమార్, చిత్తూరు


మీరు వివరించిన దాన్ని బట్టి మీ అబ్బాయికి ఛైల్డ్‌హుడ్ ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఇది ఊపిరితిత్తులలోని రెండు వైపుల భాగాలతో పాటు దానిలోని అన్ని ముఖ్యమైన భాగాలనూ అంటే... అల్వియోలై, ఇంటస్ట్టీషియమ్ మొదలైన వాటన్నింటినీ ప్రభావితం చేస్తుంది. దీన్ని ఒక జబ్బుగా పేర్కొనడం కంటే దానికి సంభవించిన ఏదో ఒక నష్టం (ఇన్‌సల్ట్) వల్ల ఊపిరితిత్తులకు చెందిన స్వరూపంలోనే వచ్చే మార్పుగా చెప్పడం సరైనదిగా పేర్కొనవచ్చు. దాని ఫలితంగానే లక్షణాలు  బయటకు కనిపిస్తాయి.

చాలామంది పిల్లల్లో లక్షణాలు బయటపడినప్పుడు వాటిని బట్టి ఇది నిర్దిష్టంగా ఫలానా కారణంగా అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ అనంతర పరిణామం (పోస్ట్ ఇన్ఫెక్షియస్)గా ఇది కనిపించడంతో పాటు కొన్నిసార్లు బయటి నుంచి అవాంఛితమైన పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం (ఆస్పిరేషన్) వల్ల ఇది రావచ్చు. (అంటే ఏదైనా తింటున్నప్పుడు ఆహారపదార్థపు ముక్కల వంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం లాంటివి).

 కారణాలు : అవాంఛితమైన పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం, ఇన్ఫెక్షన్స్, వాతావరణంలోని మార్పులు, మందులు, నియోప్లాస్మిక్ కండిషన్స్ (క్యాన్సర్ సంబంధిత అంశాలు), సర్ఫెక్టెంట్ అనే అంశంలో లోపాలు ఉండటం, కొలాజెన్ వాస్క్యులార్ డిసీజ్, దీర్ఘకాలిక కిడ్నీ, లివర్, పేగు సంబంధిత వ్యాధులు మొదలైనవన్నీ ఇంటస్ట్టీషియల్ లంగ్ డిసీజ్‌కు కారణాలు. ఈ జబ్బు ఏ వయసులోనైనా రావచ్చు.

 లక్షణాలు : దగ్గు, ఊపిరి బలంగా, ఎక్కువసార్లు తీసుకోవడం... ఈ లక్షణాలు  నెల కంటే ఎక్కువ రోజులు కనిపించడం, కుటుంబంలో ఎవరికైనా ఈ జబ్బు ఉన్న చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ), ఎదుగుదలలో లోపం, చిన్నారుల శరీరం నీలంగా మారడం (సైనోసిస్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్‌ను నిర్ధారణ (డయాగ్నోజ్) చేయడానికి లక్షణాలతో పాటు సవివరమైన వైద్య పరీక్షలు అవసరం. ప్రత్యేక స్కోరింగ్ సిస్టమ్ ద్వారా ఈ రోగుల వ్యాధి తీవ్రతను గ్రేడింగ్ చేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. పైన పేర్కొన్న లక్షణాలున్న ప్రతివారికీ అది ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మరికొన్ని వ్యాధుల్లో... అంటే ఉదాహరణకు కొన్ని రకాల గుండెజబ్బులు, ఆస్తమా, టీబీ, కొన్ని వ్యాధినివారణ శక్తి లోపించిన సందర్భాలు (ఇమ్యునలాజికల్ లోపాలు), సీలియరీ డిస్కనేసియా వంటి జబ్బులు కూడా పైన పేర్కొన్న లక్షణాలతోనే కనిపించవచ్చు.
అందుకే ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ నిర్ధారణ చేయడానికి పూర్తిస్థాయి రొటీన్ పరీక్షలు, ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రత్యేక పరీక్షలు (అంటే హెచ్‌ఆర్‌సీటీ, పీఎఫ్‌టీ, శాచ్యురేషన్ ఎస్‌ఏఓ-టు),  అలర్జీకి సంబంధించిన పరీక్షలతో పాటు లంగ్ బయాప్సీ, బ్రాంకోస్కోపీ పరీక్షలను తప్పనిసరిగా చేయాలి. అలాగే కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు తెలుసుకోవడానికి డీఎన్‌ఏ మ్యూటేషన్ పరీక్షల వంటి జెనెటిక్ పరీక్షలు చేయించాలి. వీటన్నింటి వల్ల ఊపిరితిత్తుల్లో వచ్చిన మార్పులను బట్టి అది ఏ ఉపవర్గానికి (సబ్‌టైప్‌కు) చెందినదో తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఇది ఏ మేరకు నయమవుతుందో తెలుసుకోడానికి (ప్రోగ్నోసిస్‌కు) ఇది చాలా ముఖ్యం.

 ఇక మీ బాబు విషయంలో అది ఇన్ఫెక్షన్ అనంతర (పోస్ట్ ఇన్ఫెక్షియస్) పరిణామంగా వచ్చి ఉండవచ్చు. మీ అబ్బాయి విషయంలో ఒక మంచి పరిణామం ఏమిటంటే అతడికి ఆక్సిజన్ ఇవ్వడం వల్ల, కొద్దిపాటి స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల మెరుగుదల కనిపిస్తోందని మీరు చెప్పారు. అది మీ అబ్బాయి కండిషన్‌కు మెరుగుదల విషయంలో మంచి సూచన. ఇక ఈ జబ్బు ఎందుకు వస్తోందని నిర్ధారణ చేయడం అన్నది చాలా ప్రత్యేకమైన పెద్ద సెంటర్ల  (స్పెషలైజ్‌డ్ లంగ్ సెంటర్స్) లో మాత్రమే సాధ్యపడుతుంది. ఇది తెలుసుకోవడం ఎందుకంటే... ఈ జబ్బు విషయంలో కారణాలను బట్టే చికిత్స ఆధారపడుతుంది. ఆక్సిజన్ ఇవ్వడం, పల్స్ మిథైల్ ప్రెడ్నిసలోన్ థెరపీ అన్నవి ఈ చికిత్సలో చాలా ప్రధానం. ఇక కారణం తెలియని పరిస్థితుల్లో ఇమ్యునోసప్రెస్సెంట్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్ వల్ల మంచి ఫలితాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గతంలో కొన్ని కేసుల్లో పేషెంట్స్ సుదీర్ఘకాలం పాటు కేవలం ఆక్సిజన్ మీద ఉండటం వల్ల కూడా మెరుగుదల కనిపించిన దాఖలాలు ఉన్నాయి. మందులతో ఎలాంటి ప్రయోజనం కనిపించని సందర్భాల్లోనూ, బయటి నుంచి ఇవ్వాల్సిన ఆక్సిజన్ ఎక్కువగా ఇవ్వాల్సివస్తున్న పరిస్థితుల్లో  మాత్రం ‘ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స’ గురించి ఆలోచించాల్సి ఉంటుంది.

 మీరు పైన పేర్కొన్న విధానంలో వైద్య చికిత్స చేయిస్తూ అలర్జీకి కారణమయ్యే అంశాల (అలర్జెన్స్) నుంచి పిల్లవాడిని దూరంగా ఉంచుతూ, ఎవరైనా పొగతాగుతుంటే ఆ పొగ (పాసివ్ స్మోకింగ్) నుంచి  కూడా దూరంగా ఉంచుతూ, పిల్లవాడిలో ఎలాంటి మార్పులు కనిపించినా తక్షణం వైద్యసహాయం కోసం తీసుకెళ్తూ, పల్మునరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్ వంటి దుష్ర్పభావాలు కనిపిస్తే దానికి తగిన చికిత్స చేయిస్తూ ఉండటం ఈ పిల్లల విషయంలో చాలా అవసరం. పల్మునాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఇమ్యునాలజిస్ట్‌ల పర్యవేక్షణలో ఉంచడం కూడా చాలా అవసరం. దీనికి ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏదీ లేదు. అయితే పుష్టికరమైన ప్రోటీన్‌లు, క్యాలరీలతో కూడిన ఆహారం ఇవ్వడం మాత్రం అవసరం. ఇక అతడి దినచర్యల విషయానికి వస్తే అతడు సౌకర్యంగా ఉండేలా చూడటం ముఖ్యం. ఇక ఈ జబ్బు ఉన్న పెద్ద పిల్లలకు నిపుణుల పర్యవేక్షణలో కొన్ని వ్యాయామ విధానాలు (మానిటర్‌డ్ ఎక్సర్‌సైజ్ ప్రోగ్రామ్స్) ఇతరత్రా సాధారణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీళ్లలో క్రమం తప్పకుండా ఆక్సిజన్ శాచ్యురేషన్ స్థాయులు పరిశీలిస్తూ ఉండాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది.

 పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని మీరు నిత్యం ఒక పీడియాట్రిక్ లంగ్ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో మాత్రమే చికిత్స తీసుకుంటూ వారి ఫాలోఅప్‌లో ఉండటం చాలా ముఖ్యం.

 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
 స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

అల్జైమర్స్‌కు ఆయుర్వేద పరిష్కారాలు..?

  మా నాన్నగారి వయసు 68. గత ఆరునెలలుగా మతిమరపు ఎక్కువవుతోంది. డాక్టర్లు పరీక్ష చేసి అల్జైమర్స్ వ్యాధిగా అనుమానిస్తున్నారు. దీనికి ఆయుర్వేదంలో మంచి మందులు, ప్రక్రియలు సూచించ ప్రార్థన.   
 - నరసింహ, మెదక్


శిరస్సు ఎముకల సముదాయాన్ని పుర్రె అంటారు. దాని లోపలి పదార్థాన్ని మెదడు అంటారు. దీనినే ఆయుర్వేద పరిభాషలో కపాలం, మస్తిష్కం అనే పేర్లతో వ్యవహరిస్తారు. మెదడు క్రియలు లేదా కర్మలు అనేకం. అందులో మనోవ్యాపారాలు కూడా ఒకటి. మనసు నిర్వర్తించే ప్రధాన కర్మలు మూడు. అవి ‘ధీ, ధృతి, స్మృతి’. వాస్తవానికి మూడు శక్తులు. మేధాశక్తి, విషయ విజ్ఞానాలను పదిలపరచి భద్రంగా దాచుకునే శక్తి. దాగిన విషయాలను గుర్తుకు తెచ్చుకునే శక్తి. స్మృతి భ్రంశ లేదా స్మృతి నాశ అవస్థల్ని అల్జైమర్స్ వికారంగా సరిపోల్చుకోవచ్చు. మస్తిష్కంలోని కొన్ని కణాల క్రియా శైథిల్యమే ఈ వ్యాధికి సంప్రాప్తి. అనేక శారీరక, మానసిక వ్యాధులతోపాటు, వార్థక్యాన్ని కూడా దీనికి కారణం గా గమనించారు. రసాయనచికిత్సని ఆయుర్వేదం అభివర్ణించింది. రసాయన ద్రవ్యాలు అనేకరకాలు. ఇక్కడ వాడవలసినవి మస్తులుంగ పుష్టికర ఔషధాలు. వీటిన మేధ్య రసాయనాలంటారు. వీటిని వ్యాధిగ్రస్థులేగాక, ఆరోగ్యవంతులు, చిన్నపిల్లలు కూడా అనువైన మోతాదులో అనునిత్యం వాడుకోవచ్చు. దీనివల్ల మనస్సు తేజోవంతంగా, సునిశితంగా పనిచేస్తుంది. ఈ కింది సూచనల్ని, మందుల్ని ఆరునెలలపాటు క్రమం తప్పకండా వాడి ఫలితాన్ని సమీక్షించుకోండి.

 ఆహారం: శాకాహారం, సాత్వికాహారం, ఆవుపాలు, ఆవునెయ్యి, ఉప్పు, కారం, మసాలాలు మానెయ్యాలి. బాదం, పిస్తా, ద్రాక్ష, దానిమ్మ మంచివి.

 విహారం: తగినంత విశ్రాంతి, శ్రావ్య సంగీత వాయిద్యాలు, మధురమైన పాటలు ఉపయోగకరం. వీలును బట్టి ప్రాణాయామం మంచిది. మేధ్య రసాయన ద్రవ్యాలు: గోధుమ, ఆవుపాలు, ఆవువెన్న, ఆవునెయ్యి, ఓషధులలో బ్రాహ్మీ (సంబరేణు), మండూకపర్ణి (సరస్వతి), శంఖపుష్పి, అపరాజిత (దిరిశెన) ప్రశస్తమైనవి. మందులు: మహా పంచగవ్య ఘృతం: ఒక చెంచా మందుని నాలుగు చెంచాల ఆవుపాలలో కలిపి, రెండుపూటలా ఏదైనా తినటానికి ముందుగా తాగాలి  స్మృతి సాగర రసమాత్రలు ఉదయం 1, రాత్రి 1 తిన్న తర్వాత వాడాలి. సారస్వతారిష్ట ద్రావకం-నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రెండుపూటలా తాగాలి. స్వర్ణబ్రాహ్మి మాత్రలు రోజుకి-1.

 గమనిక: మేధ్య రసాయన ఓషధులలో ఏవైనా ఒక దాని ఆకుల్ని శుభ్రం చేసి, దంచి, స్వరసం తీసి, మూడు చెంచాల మోతాదుని తేనెతో రెండుపూటలా సేవించాలి. దీనికి ఒక చెంచా ఆమలకీ (ఉసిరికాయ) స్వరసం కలిపితే ఇంకా మంచిది.

 వసకొమ్ముని నీళ్లతో నూరి, ఆ ముద్దని రెండు చిటికెల (300 మి.గ్రా) తేనెతో వారానికి రెండుసార్లు నాకిస్తే మంచి మేధ్య రసాయనంగా పనిచేస్తుంది. (ఎక్కువైతే అది వాంతికరం)

 ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ‘ధారాచికిత్స’, మూత్రావస్తి అవసరాన్ని బట్టి అమలుపరిస్తే ఫలితం గణనీయంగా ఉంటుంది. ఇతర వ్యాధుల్ని గమనిస్తే, వాటికి కూడా సరియైన చికిత్స అవసరం.

 డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
 అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
 సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్

26, సెప్టెంబర్ 2013, గురువారం

పళ్లతో ఫేషియల్‌


కలల సోయగాన్ని.. కాంతులీనే చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే ప్రకృతికి మించిన స్ఫూర్తి మరొకటి లేదు. తాజా పండ్లలో ఎన్నో పోషకాలున్నాయి. ఆరోగ్యానికే కాదు.. సౌందర్యానికీ ఎంతగానో దోహదం చేస్తాయి. విభిన్నరకాల ఫలాలతో ఫేషియల్స్‌ చేయించుకోవడం నానాటికీ ఆదరణ పొందుతున్నది. ఈ మండు వేసవిలో సహజ సౌందర్యానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
వేసవి ప్రభావం అప్పుడే మొదలైంది. బయటకెళితే చాలు, చర్మం కంది పోవడం, కమిలిపోవడం, మెరుపు తగ్గి పొడిబారడం ఆరంభమైంది. వచ్చే మూడు నాలుగు నెలల్లో మరింత ఇబ్బందిపెట్టే ఈ సమస్యలకు తాజా పండ్లు, రసాలు, గుజ్జు వంటి వాటితో ఫేషియల్స్‌ చేసుకోవడమే పరిష్కారం. ఇవి చర్మ కోమలత్వం చెదరకుండా కాపాడతాయి. శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా విటమిన్లు, పొటాషియం, సల్ఫర్‌, జింక్‌ వంటి ఖనిజ లవణాలు వంటివన్నీ పండ్లు ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగితే... వీటి గుజ్జు సౌందర్య సాధనంగా పనిచేస్తుంది.
- చర్మానికి హాయి..
సౌందర్య చికిత్సలో వాడదగిన పండ్లలో మామిడి, అరటి, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, దానిమ్మ, పుచ్చకాయ, బత్తాయి, నారింజ, ఖర్జూరం, బొప్పాయి... ఇలా ఎన్నో ఉన్నాయి. ఒక్కో పండుది ఒక్కో ప్రత్యేకత. ప్రతి పండూ మేని నిగారింపును పెంచి, సరికొత్త అందాన్ని చేకూరుస్తాయి.
- మామిడితో మంచి రంగు..
ఎలాంటి చర్మతత్వం గలవారైనా ఈ పండును సౌందర్య చికిత్సలో వాడొచ్చు. రెండు చెంచాల మామిడి గుజ్జు, చెంచా చొప్పున తేనె, పెరుగు తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి, ముఖం, మెడ భాగానికి పూతలా వేసుకోవాలి. రెండు మూడు నిమిషాలు సున్నితంగా మర్దన చేసి, వదిలేయాలి. పది నిమిషాల తరువాత నీళ్లతో కడిగేసుకుంటే చాలు. అయితే సబ్బు వాడకూడదు. ఇలా వేసవంతా రోజు మార్చి రోజు ఈ పూత వేసుకోగలిగితే.. చర్మం పసిమిచాయతో మెరిసిపోతుంది.
- 'అరటి' తో అద్భుతం..
ఈ పండు చర్మానికి మంచి తేమనిస్తుంది. దీన్నికూడా ఏ చర్మతత్వం వాళ్లయినా వాడొచ్చు. ముఖ్యంగా పొడి చర్మతత్వం గల వారికి చాలా మంచిది. ముఖంపై వున్న ముడతల్ని నివారించే శక్తి ఈ పండు సొంతం. అరటిపండును కొద్దిగా కోసి, ఆ ముక్కను తేనెలో ముంచి ముఖం నుంచి మెడదాకా రుద్దాలి. ఇలా ఐదు నిమిషాలు చేయాలి. ఆ తరువాత కడిగేసుకుంటే చర్మం కోమలంగా మారుతుంది.
- స్ట్రాబెర్రీతో సొగసుగా..
జిడ్డు చర్మతత్వం వున్న వాళ్లకు ఈ పండుతో వేసే పూత చాలా బాగా పనిచేస్తుంది. చెంచా స్ట్రాబెర్రీ రసం, ముల్తానీమట్టి, కలబంద గుజ్జు చెంచా చొప్పున, అరచెంచా తేనెతో కలిపి పూతలా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరాక కడిగేసుకోవాలి. ఈ పూతతో మొటిమలు తగ్గుతాయి. అధిక జిడ్డు వదులుతుంది. ఈ పూతను వారానికి మూడుసార్లు వేసుకోవచ్చు. పొడిబారిన చర్మతత్వం ఉన్న వాళ్లు ఈ ప్యాక్‌ని ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఈ పండులో అధికంగా ఉండే సి విటమిన్‌ చర్మాన్ని మరింత పొడిగా మారుస్తుంది.
- ద్రాక్షతో ధగధగ..
అరకప్పు ద్రాక్షపండ్లను గుజ్జులా చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పదినిమిషాల తరవాత కడిగేసుకుంటే చాలు. ఎంతో మార్పు ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్న వాళ్లు ముల్తానీమట్టిని ద్రాక్ష రసంలో కలిపి పూతలా వేసుకోవచ్చు. దీనివల్ల చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది.
- దానిమ్మతో అందం..
ఎండవల్ల చర్మం సహజ అందాన్ని కోల్పోతుంది. వార్థక్యపు చాయలు తప్పవు. అలాంటి సమస్యల్ని నివారించి, చర్మంలో కొలాజిన్‌ ఉత్పత్తి, సాగేగుణాన్ని పెంచాలంటే.. దానిమ్మ పూతను ప్రయత్నించాలి. ఎలాంటి చర్మతత్వం గలవారైనా ఈ పండును వాడొచ్చు. దానిమ్మ గింజలకు కొద్దిగా బొప్పాయి గుజ్జు కూడా కలిపి వాడితే.. చర్మం రంగు పెరగడమే కాదు.. ముడతలు కూడా తగ్గుతాయి. చెంచా బొప్పాయి గుజ్జులో దానిమ్మ రసం రెండు చెంచాలు, చెంచా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి 15 నిమిషాల తర్వాత మునివేళ్లను తడిచేసుకుని పూతపై రుద్దుతూ తొలగించుకోవాలి. ఇలా చేస్తే మీ సహజమైన అందం మీ సొంతం అవుతుంది.
- పుచ్చకాయ ప్యాక్‌..
ఈ పండు చర్మాన్ని త్వరగా చల్లబరుస్తుంది. రెండు చెంచాల పుచ్చకాయ గుజ్జు, అరచెంచా తేనె, ఒకటిన్నర చెంచా ముల్తానీమట్టి తీసుకుని అన్నింటినీ కలిపి చర్మానికి పూత వేయాలి. దీనివల్ల ఎండకు ఎర్రగా మారిన చర్మంలో చాలా త్వరగా మార్పు కన్పిస్తుంది. అందగానూ మారుతుంది.
- బొప్పాయితో బహుచక్కగా..
అన్నిరకాల చర్మతత్వాల వారికీ మేలుచేసే బొప్పాయి పండు గుజ్జును చర్మానికి నేరుగా రాయకూడదు. దానివల్ల చర్మం చాలా మొరటుగా తయారయ్యే ప్రమాదం వుంది. చెంచా బొప్పాయి గుజ్జులో అదే మోతాదులో కీరదోస గుజ్జు కలిపి రాసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే చర్మం తళుకులీని, తేటగా కనిపిస్తుంది.
- ఖర్జూర ప్యాక్‌..
నాలుగైదు ఎండు ఖర్జూరాల్ని నీళ్లల్లో నాలుగు గంటలు నానబెట్టాలి. తరువాత చిక్కగా చేసుకుని, అందులో చెంచా పాలపొడి వేసి బాగా కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. ఎండు ఖర్జూరాలే కాదు.. బజార్లో దొరికే గింజల్లేని తాజా వాటిని కూడా ప్రయ త్నించవచ్చు.

బరువు తగ్గాలంటే నిలబడండి..!


స్థూలకాయులకు ఒక శుభవార్త. బరువు తగ్గాలంటే ఇకపై బరువులు మోయనక్కరలేదు అంటున్నారు పరిశోధకులు. ఆఫీసుల్లో పనిచేసుకుంటూ కూడా బరువు తగ్గవచ్చట. కానీ ఆఫీసు పనులే నిలబడి చేస్తే చాలు, బరువు తగ్గడం మొదలవు తుందని అంటున్నారు. ప్రతిరోజూ మూడు గంటల పాటు నిలబడి పనిచేస్తే సుమారు నాలుగు కిలోల బరువు తగ్గే అవకాశం ఉందట! అంతే కాకుండా కూర్చుని పనిచేసే వారికంటే ఇలా నిలబడి పనిచేసేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారట! మూడుగంటల పాటు నిలబడితే దాదాపు 150 కాలరీలు ఖర్చవుతాయి. ఏదోరకంగా కాలరీలు ఖర్చు చేయడమే మనకు మంచిది కదా!.

అవును! కంప్యూటర్‌ గేమ్స్‌ వ్యసనమే

ఇటీవలి కాలంలో చాలా మంది చిన్నారులకు కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడడం ఒక వ్యసనంగా మారింది. ఒక్కడే పిల్లాడు (ఏకైక సంతానం) అయి, పిల్లలతో తల్లిదండ్రుల ఎక్కువ సమయం గడపలేనప్పుడు, ఆడుకోవడానికి తోటి వయసు వారు లేనప్పుడు పిల్లలకు ఈ ధోరణి అలవడుతుంది. మంచి తెలివితేటలు, శారీర దారుఢ్యం ఉన్నప్పటికీ భావోద్వేగాలపరంగా బలహీనులైన కొందరు పిల్లలు త్వరగా ఈ రకమైన వ్యసనాలకు లోనవుతారు. ఇంకా కంప్యూటర్‌ గేమ్‌సెంటర్లలో ఉండే పెద్ద పెద్ద మానిటర్లు, ఆడియో-విజువల్‌ ఎఫెక్టులు, కొత్త కొత్త గేమ్స్‌, టెర్రరిస్టులను మట్టుబెట్టడం, మిలిటరీ తరహా సాహసకృత్యాలు పిల్లల్ని అందునా అబ్బాయిలను ఇట్టే ఆకర్షిస్తాయి. ఈ ఆటలను ఆడేటప్పుడు అబ్బాయిలు పెద్దగా అరవడం, విజయం సాధించగానే కేరింతలు కొట్టడం వంటివి చేస్తూ ఆటలో పూర్తిగా నిమగమై తామే ప్రత్యక్షంగా పాల్గొన్ని విజయం సాధించిన అనుభూతికి లోనవుతుంటారు. టీన్స్‌లో ప్రధానంగా 14 నుంచి 18 ఏళ్ల వయస్సు మగపిల్లల్లో చోటుచేసుకునే హార్మోన్ల మార్పుల వల్ల వారు ఉద్రేకపూరితమైన భావనలకు లోనవుతారు. వారిని కోపగించు కోవడం లేదా ఆపాలని ప్రయత్నిస్తే వారు మరింత హద్దు మీరి ప్రవర్తించడం, పెడసరంగా తయారై చదువును విస్మరించడం లాంటివి చేయడం సహజం. రాత్రిపూట ఎక్కువసేపు మెలకువగా ఉండడం వల్ల హార్మోన్ల అసమతౌల్యంతో వాళ్లలో సెక్స్‌ కోరికలు విపరీతం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. గేమింగ్‌ సెంటర్స్‌లో చెడు సావాసాలు కూడా ఏర్పడవచ్చు.
మరేం చేయాలి?
ముందుగా తల్లితండ్రులిద్దరూ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. పిల్లలను కొట్టడం, తిట్టడం లేదా అవమానించడం చేయకూడదు. వారికి గేమింగ్‌ సెంటర్లలో ఉండే కంప్యూటర్లు లేదా వాటిని పోలిన కంప్యూటర్‌ను ఇంట్లో అమర్చండి. దీని వల్ల పిల్లలను ఇంటిపట్టునే ఉండేలా చేయవచ్చు. పిల్లల్ని ఆ వ్యసనం నుంచి దూరం చేయాలంటే గేమింగ్‌ సెంటర్స్‌ లాంటి చోట నుండి పిల్లలను ఇంటికి తేవడం అన్నది తొలి అడుగు. ఇంట్లో కంప్యూటర్‌ అమర్చడం ద్వారా దాన్ని సాధించవచ్చు. ఆ తర్వాత తన తోటి వయస్సు పిల్లలతో మీ పిల్లలు కలిసే వాతావరణాన్ని కల్పించండి. అయితే ఆ పిల్లలు ఇలాంటి వ్యసనాలు లేనివారై ఉండేలా చూసుకోవాలి. ఇది మీ బాధ్యతే. పిల్లలలో ఉన్న కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని మెచ్చుకోండి. ఆటలే కాకుండా ఇతరత్రా పనికొచ్చే విధంగా వారు ఇంకేదైనా చేయగలరేమో సున్నితంగా అడగండి. అంటే ప్రజెంటేషన్లు.. టైపింగు లాంటివి.
తప్పకుండా రాత్రి భోజనం ఇంట్లో అందరూ కలిసి చేసే విధంగా చూడండి.
పిల్లలను శారీరకంగా శ్రమ కలిగించే ఆటల్లో పాల్గొననివ్వకుడా ఎప్పుడూ 'చదువూ, చదువూ' అని తల్లితండ్రులు పోరు పెట్టకూడదు. అలాంటి పరిస్థితుల్లోనూ పిల్లలు ఈ తరహా గేమ్స్‌కు త్వరగా అలవాటు పడతారు. వీలైతే వారు శారీరక శ్రమ కలిగే ఆటల్లో పాల్గొనేలా చూడాలి.
వ్యాయామాలు, ఆటలలో పిల్లలను పాల్గొనమని ఉత్సాహపరచాలి.
ఈ కంప్యూటర్‌ గేమ్స్‌కు అలవాటు కావడం అంటే పెద్దల్లో ఆల్కహాల్‌, పొగతాగడం ఎలాగో పిల్లల్లో ఇదీ అలాంటి వ్యసనమేనని గుర్తుంచుకోవాలి. దీన్ని మాన్పించడానికి చాలా సమయం, చాలా ఓపిక కావాలి. నిపుణుల సలహా కూడా అవసరం కావచ్చు.

నడుము, మెడ నొప్పులకు సర్జరీ లేని చికిత్స


మన జీవనశైలి, ఆఫీసులో కూర్చునే విధానం, ఇళ్లల్లో మహిళలు పనిచేసే విధానంలో మార్పులు, పరిశ్రమల్లో కార్మికులు అస్తవ్యస్థమైన భంగిమల్లో బరువులెత్తడం, పనిచేయడంవల్ల నడుం, మెడ నొప్పులొస్తాయి. తొలిదశలోనే వీటిని గుర్తిస్తే జీవనశైలి మార్చుకోవడం వల్ల, వ్యాయామం చేయడం వల్ల నివారించే వీలుంది. సరైన నిర్ధారణ చేయకపోవడం, రోగి పరిస్థితులు, స్థితిగతులు, పనిచేసే విధానం, ఉపయోగించే వాహనాలు.. ఇలా అనేక అంశాలు పరిగణలోకి తీసుకోకుండానే నడుం, మెడనొప్పులకు శస్త్రచికిత్స చేస్తున్నారు. శస్త్రచికిత్స అవసరం లేకుండానే నడుం, మెడనొప్పులను తగ్గించే వీలుందని అంటున్నారు ప్రముఖ ఫిట్‌నెస్‌ నిపుణులు డాక్టర్‌ భక్తియార్‌చౌదరి. హైదరాబాద్‌ స్పైన్‌క్లినిక్‌ను నిర్వహిస్తున్న భక్తియార్‌చౌదరి 1200 మందిని సర్వే చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన నడుము, వెన్నునొప్పులు, నివారణ చర్యల గురించి తాను చేపట్టిన అధ్యయన విశేషాలను తెలిపారు. ఆ వివరాలు....
ఆపరేషన్‌ అవసరం లేకుండా నడుము, మెడ నొప్పులను నివారించే వీలుందా?
అవును. 95 శాతం కేసుల్లో ఆపరేషన్‌ నుంచి వెన్నెముకను కాపాడే వీలుంది.
మీరు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన అంశాలు వివరిస్తారా?
ఈ అధ్యయనం అందరికళ్లను తెరిపిస్తోంది. సాధారణ నడుం, మెడనొప్పులకు ఆపరేషన్‌ చేసుకోకపోవడం వల్ల చచ్చుబడిపోవడం లేదనే విషయాన్ని ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన అధ్యయనాలు వెల్లడించలేదు. నడుము నొప్పి, మెడనొప్పు లకు చాలా అరుదుగా మాత్రమే సరైన రోగ నిర్ధారణ చేస్తున్నారు. ప్రతీ మెడనొప్పి స్పాండిలోసిస్‌ వల్ల రాదు. ప్రతీ నడుంనొప్పి డిస్క్‌ప్రోలాప్స్‌ వల్ల రాదు. వీటిలో 80 శాతం వరకు వృత్తిపరమైన ఒత్తిడివల్ల వస్తున్నాయి. గృహిణి బాధపడే నడుంనొప్పి నుంచి, గనుల్లో పనిచేసే కార్మికుడు బాధపడే తీవ్ర నడుం ఒత్తిడిని ఆపరేషన్‌ లేకుండా చికిత్స చేయొచ్చు. నివారించొచ్చు. ఇవీ వెన్నెమక వ్యాధికి సంబంధించిన కొన్ని అంశాలు. నడుము/మెడ నొప్పులకు సర్జరీ చేయాల్సిన అవసర ముందని వైద్యులు చెప్పాక చాలామంది రెండో అభిప్రాయం కోసం మా వద్దకు వస్తుంటారు. ఇలాంటి వారిలో 97 శాతం మంది 'సంప్రదాయ విధానం' వల్ల శస్త్రచికిత్స లేకుండానే విజయవంతంగా కోలుకున్నారు. కేవలం కొద్దిశాతం మందిలో సమస్య మళ్లీ తిరగబెట్టినా, తర్వాత కోలుకున్నారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా మేం కొన్ని ప్రామాణికమైన పద్ధతులను అనుసరిస్తాం. అవి...
వివరణాత్మకమైన అంచనా.
వెన్నెముక కుదురుగా ఉంచే అంశాల పునఃస్సంధానం.
శరీర బరువు నిలకడగా ఉండేలా చూడడం.
కండరాలను దృఢపరిచే దిద్దుబాటు చర్యలు.
కండరాల అభ్యాసం.
ఎర్గొనామిక్స్‌ను అనుసరించడం. పనిచేసే ప్రదేశంలో లోపాలను సవరించుకోవడం.
నొప్పుల నిరోధక వ్యాయామం.
ఆర్థోటిక్స్‌, సపోర్ట్స్‌.
జాగ్రత్తగా ప్రణాళిక రూపొందించి, అంచనా వేసి, కౌన్సిలింగ్‌ చేయడంవల్ల పెద్ద సంఖ్యలో నడుం, మెడనొప్పులను నివారించే వీలుందని మేం గమనించాం.
మీరు చికిత్స చేసిన రెండు కేసులను ఉదహరిస్తారా?
ముందే చెప్పినట్లు నడుం, మెడనొప్పు లతో వచ్చిన రోగిని జాగ్రత్తగా పరిశీలించాలి. అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఏం పని చేస్తారు? ఎన్ని గంటలు పనిచేస్తారు? అలవాట్లు ఏమిటి? తదితర విషయాలు తెలుసుకోవాలి.
కేస్‌ స్టడీ- 1 : పాలు పోసేందుకు ఒక వ్యక్తి స్కూటర్‌ను ఉపయోగిస్తున్నాడు. రెండువైపుల పాల క్యాన్లు తగిలించుకుని రోజూ పాలు పోసేవాడు. అయితే రెండువైపుల సమతుల్యత లోపించేది. ఒకవైపు బరువు ఎక్కువ, ఇంకోవైపు తక్కువ ఉండేది. దీంతో స్కూటర్‌ ఒకవైపుకు ఒరిగిపోయేది. దీన్ని సమం చేయడానికి ఇంకోవైపు కండరాలపై మరింత భారంపడేది. తన నడుంనొప్పి కోసం చాలామంది వైద్యులను సంప్రదించాడు. మందులు వాడాడు. డిస్క్‌జబ్బు, డిస్క్‌ప్రొలాప్స్‌ ఉందన్నారు. సర్జరీ చేయించు కోవాలని సలహా ఇచ్చారు. దీనికి సర్జరీ అవసరంలేదు. నా దగ్గరికొచ్చే వరకూ సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేశారు. అన్ని విషయాలు తెలుసుకున్నాను. కేవలం అతని స్కూటర్‌ను పరిశీలించి, లోపాన్ని సరిచేశాను. దీంతో నడుంనొప్పి పూర్తిగా తగ్గింది.
కేస్‌ స్టడీ-2 : 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు కొన్ని రోజు లుగా నడుంనొప్పితో బాధపడుతున్నాడు. తీవ్రమైన నొప్పి రావ డంతో డాక్టర్‌ను కలిశాడు. డాక్టర్‌ అతన్ని పరిశీలించకుండానే, అతని వృత్తి ఏమిటనేది తెలుసుకోకుండానే ఎంఆర్‌ఐ చేయించు కోవాలని సూచించారు. రిపోర్టు చూసి డిస్క్‌సర్జరీ చేయాలని అన్నారు. నా దగ్గరకు వచ్చినప్పుడు తన గురించి చెప్పాడు. తను పనిచేసే సంస్థలో సరైన భంగిమలో కూర్చోకపోవడంవల్ల, తల ముందుకు వాల్చడం వల్ల ఈ సమస్య వచ్చిందని గమనించాను. దీంతో ఇతను ఐటి పరిశ్రమలోని వారికి వచ్చే 'స్ట్రేయిట్‌ స్పైన్‌ సిండ్రోం' బారినపడ్దాడు. సర్జరీ అవసరం లేదని చెప్పాను. పనిచేసే ప్రదేశంలో కూర్చునే విధానంలో ఉన్న లోపాలను వివరించి, సరి చేశాను. నడుం నొప్పి తగ్గింది.
అసలు ఎర్గొనామిక్స్‌ అంటే ఏమిటి?
ఇది మనదేశ ఉత్పత్తికి ఒక కీలకమైన అంశం. ఎర్గొనామిక్స్‌లో రెండు పదాలున్నాయి. ఎర్గొ అంటే పని, నామిక్స్‌ అంటే ఎకానమి. ఇవి రెండు కలిపితే ఎర్గొనామిక్స్‌ అవుతుంది. అంటే సులభంగా, సౌకర్యంగా పనిచేయడాన్ని ఇది సూచిస్తుంది. ఎర్గొనామిక్స్‌ అపారమైన ఇంగితజ్ఞానమున్న పాత శాస్త్రం. కానీ ఇది చాలాదేశాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇది మనిషి-యంత్రం సంబంధాన్ని సూచిస్తుంది. గడ్డం చేసుకోవడం, పెట్రోలియం బావులు తవ్వడం, ఎకె-47 తుపాకి మడమ, కంప్యూటర్‌తో పనిచేసే ప్రదేశాలు.... అన్నీంటికీ సురక్షితమైన ఎర్గొనామిక్స్‌ అవసరం. పనిచేసే ప్రదేశంలో సరైన విధంగాలేని ఎర్గొనామిక్స్‌వల్ల పెద్దసంఖ్యలో ఆరోగ్యసమస్యలు వృద్ధి చెందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనదేశం ఈ సమస్యల్లో మొదటిస్థానాన్ని ఆక్రమించింది. గంటలపాటు నిల బడి, వివిధ భంగిమల్లో మెడ, చేతులను ఉపయోగించే టీచర్లు, లెక్చరర్లు వృత్తిపరమైన బాధాకర రుగ్మతల ప్రభావానికి గురయ్యే ప్రమాదముంది.
తప్పుడు ఎర్గొనామిక్స్‌ వల్ల మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయి?
సరిగ్గాలేని ఎర్గొనామిక్స్‌ తప్పుడు భంగిమకు దారితీస్తుంది. ఇది మనిషి కండర-అస్తిపంజిర వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి కలిగిస్తుంది. ఫలితంగా కుములేటివ్‌ ట్రామ డిజార్డర్‌, ఎర్లీ డిస్క్‌-డిసీజ్‌, జాయింట్‌ స్ట్రెయిన్‌, ఎర్లీ స్పాండిలోసిస్‌, అధికరక్తపోటు వంటి వ్యాధులు వస్తాయి. తప్పుడు ఎర్గొనామిక్స్‌వల్ల కండరాలు నొప్పులు, నరాల నొప్పులు, వెన్నెముకలో వైకల్యం వంటివి సంభవిస్తాయి. 44 శాతం మంది భారతీయులు వృత్తిపరమైన ప్రమాదాల బారినపడుతున్నారు. ఇందులో 30 శాతం మందికి ఇళ్లల్లో, పనిచేసే ప్రదేశాల్లో అనుసరించాల్సిన సురక్షిత ఎర్గోనామిక్స్‌పై అవగాహన లేకపోవడం కారణం.
స్పాండిలోసిస్‌ అంటే ఏమిటి?
వయస్సుతోపాటు వెన్నుపూస మందంలో తగ్గుదల, చిన్న ఎముకల మధ్యస్థలం తగ్గడం, వెన్నుపూసల మధ్య ఉన్న కీళ్ల ఉపరితలంపై మృదుత్వాన్ని కోల్పోవడాన్ని స్పాండిలోసిస్‌ అంటారు. సాధారణంగా 60 ఏళ్ల తర్వాత ఇది కనిపిస్తుంది. చాలా వృత్తుల్లో వెన్నెముకను దుర్వినియోగం చేయడం, మితిమీరివాడటం వల్లా కొన్నిసార్లు స్పాండిలోసిస్‌ వస్తుంది.
వెన్నుపూసకు వచ్చే ఇతర జబ్బులేమిటి?
ఇన్‌ఫెక్షన్‌ (క్షయ), ఆటో-ఇమ్యూన్‌డిసీజ్‌, ట్రాఫిక్‌ ప్రమాదాలు, కిందపడటం, క్యాన్సర్‌ కణతి వల్ల కూడా స్పాండిలైటిస్‌ వస్తుంది. ఇలాంటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం.
నడుం, మెడనొప్పులకు ఎప్పటికీ సర్జరీ అవసరం లేదా?
ముందే చెప్పినట్లు 95 శాతం కేసుల్లో సర్జరీ అవసరం లేదు. కేవలం ఐదు శాతం కేసుల్లోనే సర్జరీ అవసరం. కొన్ని ముఖ్యమైన ప్రమాదకర చిహ్నాలు సర్జరీ చేయించుకోవాలని సూచిస్తాయి. అవి...
అన్ని క్యాన్సర్‌ కణితులు
తీవ్రమైన ఫ్రాక్చర్లు
శరీర నిర్మాణ అసాధారణ స్థితి.
చికిత్సకు స్పందించని పురోగమన క్షీణత
మూత్రనాళ ప్రమేయం, ఫూట్‌-డ్రాప్‌.
విశ్రాంతి తీసుకున్నా, చికిత్స చేయించుకున్నా భరించలేని నొప్పి ఉంటే.
పరిస్థితి మరింత దిగజారినా, మూడునెలలపాటు 'కన్సర్వేటివ్‌ మేనేజ్‌మెంట్‌' విధానం పాటించినా ఫెయిలైన ప్పుడు శస్త్రచికిత్స అవసరం.
వెన్నుముకలోని డిస్క్‌తో సంబంధం ఉన్నా, లేకపోయినా నడుం, మెడనొప్పులను శస్త్రచికిత్స అవసరం లేకుండానే విజయ వంతంగా చికిత్స చేయవచ్చు.
నడుము, మెడనొప్పుల నివారణకు మీరిచ్చే సలహాలు ?
మన జీవనశైలిని మార్చుకోవడం వల్ల వీటిని చాలావరకు తగ్గించునే వీలుంది. దీనికి చేయాల్సింది....
బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు సరైన భంగిమ లోఎత్తాలి.
పడుకునే పరుపులు, తల కింద పెట్టుకొనే దిండ్లు / మెత్తల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి.
పనిచేసే ప్రదేశంలో ఎర్గొనామిక్స్‌ పద్ధతులను పాటించాలి.
శరీరాకృతికి సరిపడే ద్విచక్ర వాహనం లేదా కారును ఉపయోగించాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వెన్నెముకకు చాలా కీలకం.
రోజువారీ పనుల్లో కాళ్లను ఉపయోగించండి.
బరువులో 25 శాతం కంటే ఎక్కువ బరువుండే వస్తువు లను ఎత్తడాన్ని నిలువరించాలి.
వయస్సు, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. మంచిపోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి.
నొప్పి రాగానే శస్త్రచికిత్స నిపుణుల్ని కాకుండా ఫిజీషియన్‌ను సంప్రదించండి.
బరువు తగ్గుతుంటే మీ అంతట మీరే పరిశీలించండి.
తొలిసారి నొప్పు లకు సంబంధించి జబ్బు ల నిర్ధారణకు సిటిస్కాన్‌, ఎక్స్‌రేలు, ఎంఆర్‌ఐలు అవసరం లేదు.
నివారణ వ్యాయామ కార్యక్రమం చాలా ముఖ్యం
పోషకాహారలోపం, విటమిన్‌ లోపం, హార్మోన్ల అసమతుల్యతను సరి చేసుకోవాలి. 

భక్తియార్‌చౌదరి
ఫిట్‌నెస్‌ నిపుణులు
హైదరాబాద్‌.  

9849136940

భుజంగాసనం

భుజంగాసనం
హైదరాబాద్ : భుజంగం అంటే సర్పం. ఈ ఆసనం వేసినప్పుడు ఛాతీ, మెడ, తల పెకైత్తి ఉండడంతో ఈ భంగిమ పడగ విప్పిన పామును పోలి ఉంటుంది. కాబట్టి దీనిని భుజంగాసనం అంటారు. ఇదే ఆసనాన్ని కొద్దిపాటి మార్పులతో నాలుగు రకాలుగా సాధన చేయవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది వాటిలో ఒక పద్ధతి.

ఎలా చేయాలి?
బోర్లా పడుకుని రెండు చేతులను (ఎడమ అరచేతి మీద కుడి అరచేతిని ఉంచాలి. ఫొటోని గమనించండి) గడ్డం కింద ఉంచుకుని కొద్ది క్షణాలు విశ్రాంతి స్థితిలో ఉండాలి.

బోర్లించి ఉంచిన అరచేతులను ఛాతీ కిందకు తెచ్చుకోవాలి. ఇప్పుడు పూర్తిగా శ్వాస తీసుకుని దేహం బరువుని రెండు చేతుల మీద మోపుతూ తలను పైకి లేపాలి.

ఇలానే ఉండి, నాభి దిగువ ప్రాంతం వరకు పైకి లేపాలి. ఈ స్థితిలో చేతులు నిటారుగా (మోచేతుల దగ్గర వంచకుండా) ఉండాలి, చూపు ఆకాశం వైపు ఉండాలి. రెండు కాళ్లు భుజాలకు సమాంతరంగా ఉండాలి. మనసును వీపు దిగువ భాగం మీద కేంద్రీకరించాలి.

ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత తిరిగి యథాస్థితికి రావాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.

ఉపయోగాలు
వెన్నుపాము శక్తిమంతం అవుతుంది. వెన్నునొప్పి తగ్గిపోతుంది. ఛాతీ విశాలమవుతుంది. ఉబ్బసం వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు తగ్గుతాయి.

 థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది. మెడ కండరాలకు బలం వస్తుంది. గొంతు సంబంధ వ్యాధులు నయవుతాయి. స్వరం సరళతరమవుతుంది కాబట్టి గాయకులు, న్యూస్ రీడర్లు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు ఈ ఆసనం బాగా దోహదం చేస్తుంది.

 పొట్ట కండరాలు, పొట్టలోని ఇతర భాగాలు సాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.

 చేతులకు, భుజాలకు శక్తి పెరుగుతుంది.

రుతుక్రమ సమస్యలు నివారణ అవుతాయి, ఇతర గర్భాశయ సమస్యలతోపాటు గర్భధారణ సమస్యలు కూడా తొలగిపోతాయి.

 జాగ్రత్త
 హెర్నియా ఉన్నవాళ్లు, భుజాలు అరిగిపోయిన వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయరాదు.



 బీరెల్లి చంద్రారెడ్డి
 యోగా గురువు, సప్తరుషి యోగ విద్యాకేంద్రం,
 హైదరాబాద్

వేధించే మెడనొప్పి

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కన్పించే సర్వికల్‌ స్పాండైలోసిస్‌ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ఇటీవల యుక్తవయసులో ఉన్న వారు సైతం ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం మారుతున్న జీవన శైలి విధానమే. మెడనొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అలా కాకుండా వ్యాధి తొలి దశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.

మెడ వెనుక భాగంలో తల నుండి మొదలయ్యే మొదటి 7 వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేంకు కార్టిలేజ్‌ (మృధులాస్థి) అనే మెత్తని ఎముక ఉంటుంది. వెన్నుపూస సులువుగా కదలడానికి కార్టిలేజ్‌ తోడ్పడుతుంది. ఈ ఎముక ఒక్కోసారి పెరిగి అస్టియోఫైట్స్‌ ఏర్పడుతాయి. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పుల వలన తీవ్రమైన మెడనొప్పితో వేధించబడతారు. ఇలాంటి సమస్యనే సర్వికల్‌ స్పాండిలోసిస్‌ అంటారు.

మెడ నొప్పికి కారణాలు
ఈ ససమ్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడటం వలన వస్తుంది. స్పాంజ లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీల్లో అసంబద్ధ బంగిమల్లో కూర్చోవడం, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చొని విధులను నిర్వర్తించడం. ఒకే చోట గంటల తరబడి కదలకుండా పని చేయడం, నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్స్‌ లోపించడం.

లక్షణాలు
మెడనొప్పి తీవ్రంగా ఉండి మెడ ఎటువైపు కదల్చినా నొప్పి తీవ్రత పెరుగుతుంది.
నాడులు ఒత్తిడికి గురికావడం వల్ల నొప్పి భుజాల మీదుగా చేతులకు వ్యాపిస్తుంది.
తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, తల తిప్పినట్లుగా అన్పించడం, చెయ్యిపైకి ఎత్తడం కష్టంగా మారుతుంది.
నడుస్తున్నప్పుడు, నిలబడినప్పుడు తూలుతున్నట్లుగా అనిపించడం జరుగుతుంది.

జాగ్రత్తలు
సెర్వికల్‌ స్పాండిలోసిస్‌తో వేధించబడేవారు సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. వాహనం నడిపేటప్పుడు, కుర్చిలో కుర్చున్నప్పుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరైన స్థితిలో కూర్చోవాలి. బరువులు ఎక్కువగా లేపరాదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బెడ్‌రెస్ట్‌ తీసుకోవడం తప్పనిసరి. బల్ల మీదగాని, నేల మీద గాని పడుకోవాలి. తల కింద ఎతె్తైన దిండ్లు వాడకూడదు. మెడను ఒకేసారి అకస్మాతుత్గా తిప్పకూడదు. మెడనొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయామాలు డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే చేయాలి. మెడనొప్పి రాకుండా ఉండటానికి పౌస్టికాహారాన్ని తీసుకుంటూ నిత్యం వ్యాయామం, ప్రాణాయామం, యోగా చేయాలి.

చికిత్స
హోమియో వైద్యంలో సెర్వికల్‌ స్పాండిలోసిస్‌కు మంచి చికిత్స ఉంది. వ్యాధి లక్షణాలను, వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణలోకి తీసుకొని మందులను ఎన్నుకొని వైద్యం చేస్తే మెడనొప్పి నుండి విముకిత పొందవచ్చు.

మందులు:
బ్రయోనియా: మెడ కదిలించడం వలన నొప్పి అధికమవుతుంది. విశ్రాంతి వలన నొప్పి తగ్గుతుంది. వీరు మలబద్ధకంతో బాధపడుతుంటారు. దాహం అధికంగా కలిగి ఉండి నీరు ఎక్కువగా తాగుతారు. మానసికంగా వీరికి కోపం ఎక్కువ. వీరిని కదిలించకూడదు. కదలికల వలన వీరికి బాధలు ఎక్కువ్వడం గమనించ దగిర లక్షణం. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

హైపరికం: నొప్పి మెడ, భుజకండరాల్లో తీవ్ర స్థాయిలో ఉంటుంది. కదలికలు కష్టంగా మారతాయి.

సై్పజీలియా: నొప్పి మెడ నుండి మొదలై ఎడమ భుజములో ఎక్కువగా ఉండి వేధించే వారికి ఈ మందు ప్రయోజనకారి.

కాల్మియా: నొప్పి మెడ నుండి మొదలై కుడి భుజములో ఎక్కువగా ఉండి వేధించే వారికి ఈ మందు తప్పక ఆలోచించ దగినది.

కోనియం: మెడ నొప్పితో పాటు కళ్లు తిరిగినట్లుగా అనిపిస్తుంది. మెడ అటు ఇటు తిప్పినప్పుడు వస్తువులు గుండ్రంగా తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. వృద్దుల్లో వచ్చే మెడ నొప్పికి ఈ మదు తప్పక వాడదగినది.

ఈ మందులే కాకుండా కాక్యులస్‌, రస్‌టాక్స్‌, ఆర్నికా, రూటా, కాల్కేరియాకార్బ్‌, సల్ఫర్‌, కాలికార్బ్‌ వంటి మందులను లక్షణ సముదాయాలను పరిగణలోకి తీసుకొని వైద్యం చేస్తే ‘సెర్వికల్‌ స్పాండిలోసిస్‌’ (మెడనొప్పి) నుండి విముక్తి పొందవచ్చు.

జట్టు ఊడకుండా...


మాములుగా రాలే జుట్టు సహజమైన శిరోజాల జీవిత సైకిల్‌ లో భాగమే . జుట్టు ఎదుగుదల దశ ఏడాది నుంచి మూడేళ్ళు సాగవచ్చు . ఇది 90% జుట్టుకు వర్తిస్తుంది . తరువాత దశ తాత్కాలికం ఇది ఆరు వారలు ఉంటుంది . తుది దశ విశ్రాంత దశ . ఇది పది శాతం జుట్టుకు వర్తిస్తుంది.జు ట్టు ఉడి కొత్తసి రావడానికి కొద్ది నెలలు సమయం పడుతుంది . తోలి దశను వైద్య భాషలోఎనాజే న్‌ (గ్రోత్‌ స్టేజ్‌) అని , మోడో దశకు తెలోజేన్‌ (రెస్తింగ్‌ స్టేజ్‌) అని అంటారు. ఈ ఎనాజేన్‌ దశ నుండి తెలోజేన్‌ దశ కు కదులుతున్నప్పుడు జుట్టు ఊడుతూ ఉంటుంది.

జుట్టురాలడం అనేది సాధారణ సమస్య. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ రాలిపోతుందనే ఫిర్యాదును ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటు న్నాం. జుట్టు కూడా చర్మం లాగానే కెర్సటెల్‌ అనే పదార్థం తో చేయబడింది. చర్మానికి ఎలా శ్రద్ధ తీసుకుంటు న్నామో, శిరోజాల పట్లా అలానే ఉండాలి.
సహజ కారణాలు
  • వాతావరణం పొడిగా ఉన్నప్పుడు జుట్టు పొడిబారి తెగిపోయే అవకాశం ఉంది. తేమగా ఉన్నపుడు చిక్కుపడి రాలిపోతాయి.
  • సూర్య కిరణాలు, అతి నీలలోహిత కిరణాలు.
  • మానసిక ఒత్తిడి, వౄఎత్తి, వ్యక్తిగత సమస్యలు, విద్యార్థులకైతే పరీక్షల భయం.
  • వేడి ఎక్కువగా ఉన్న నీళ్లతో తలస్నానం చేయడం, హెయిర్‌ డ్రయ్యర్ల వాడకం.
  • స్ట్రెయిటెనింగ్‌, రింగులు చేయించుకోవడం.
    ఇతర కారణాలు
    హార్మోన్‌ లోపం.. హైపోథెరాయిడిజం, రక్తాల్పత.. ఇను ము, విటమిన్‌ బి12 లోపం ఇన్‌ఫెక్షన్‌, డెటింగ్‌. ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యం వల్ల, పోశాకాహార లోపము వల్ల ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటంది. జుట్టు రాలడం లో 30 నుంచి 40 రకాలు ఉన్నాయి. ప్రధానముగా రెండు రకాలు కనిపిస్తాయి.
    జాగ్రత్తలు
  • ముందుగా జుట్టు తత్వాన్నిబట్టి షాంపూలను ఎంచు కోవాలి. వారానికి రెండు సార్లు షాంపూ చేయాలి. నూనెతత్వం ఉన్న శిరోజాలెతే రెండు రోజులకోసారి తప్పనిసరి.
  • కండిషనర్‌ తప్పనిసరి. పొడి తత్వం ఉన్నవారు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి.
  • సమతులాహారంతో జుట్టుకు తగిన పోషణ అందు తుంది. అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, తాజాపండ్లు, గుడ్లు, పప్పులు, డెరీ ఉత్పత్తుల్లో అవి సమౄఎద్ధిగా దొరుకుతాయి.
  • అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య బాధిస్తుంటే వెద్యులను సంప్రదించి ఫ్లూయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. వారి సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది.

సీజనల్‌ వ్యాధులూ.. నివారణా పద్ధతులు..


సీజనల్‌ వ్యాధుల భయం ప్రజలను వెంటాడుతోంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, అతిసార వంటి వ్యాధులు ఈ సీజన్లో విస్తరించే అవకాశం ఉంటుంది. ఇంతకీ అవి ఎందుకొస్తాయి. ఎలాంటి ఇబ్బందిని కలుగుజేస్తాయి. ఎలాంటి లక్షణాలు పొడచూపు తాయి. ఏ విధంగా నివారించ వచ్చు తదితర అంశాలను తెలుసుకొని జాగ్రత్త పడితే వాటిని అరికట్టవచ్చు.
గుంటల్లో నిలిచిన వర్షపు నీరు, మురికిగా మారిన తర్వాత అందులో దోమలు నివాసాలు ఏర్పర్చుకుని విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఈ దోమలు కుట్టడంవల్ల పలురకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా వీటివల్ల వచ్చే వ్యాధుల్లో డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు, మలేరియా, అతిసార వీటిని సకాలంలో గుర్తించి, సరైన చికిత్స తీసుకోకపోతే మరణాలు సంభవిస్తాయి. అయితే ఈ వ్యాధులకు హోమియో చికిత్సా బాగా పనిచేస్తుంది.
డెంగ్యూ, లక్షణాలు
జ్వరమూ, ఎముకల నొప్పులూ ఉంటాయి. కళ్లలోంచి నీరు కారుతుంది. కళ్లు కదలించడం కష్టంగా మారుతుంది. ఆకలి తగ్గుతుంది. వాంతి అయ్యేటట్లు ఉంటుంది. శరీరంపై దుద్దుర్లూ, పొక్కులూ వస్తాయి. ముక్కులోంచి రక్తం పడుతుంది. రక్త విరేచనాలూ, తలనొప్పీ విపరీతంగా ఉంటుంది. దీనికంతటికీ కారణం డెంగ్యూ వైరస్‌, ఎడిస్‌ ఈజిప్టు దోమలు. డెంగ్యూ సోకిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి చేర్చాలి. రోగికి తరచూ ద్రవ పదార్థాలు ఇవ్వాలి. అవసరమైతే రక్త మార్పిడి చేయాలి.
జాగ్రత్తలు
దోమలకు అవాసాలైన నీళ్ల తొట్టెలూ, టైర్లూ, పాడైపోయిన కూలర్లల్లో నీళ్లూ నిలువ ఉండకుండా చూడాలి.
మందులు
డెంగ్యూ వ్యాధి నివారణకు జల్సీ మియం అనే మందును వ్యాధి రాకముందు, ఒకరోజు మూడు మోతాదులు తీసుకుంటే వ్యాధి సోకకుండా ఉంటుంది.
వ్యాధి సోకితే యుఫటోరియం పర్ఫో టం అనే మందును వాడటంవల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాధిని త్వరగా నివారించవచ్చు.
చికున్‌ గున్యా
ఇది ప్రాణాంతక వ్యాధి కానప్పటికీ, మనిషిని కదలలేని స్థితికి చేర్చుతుంది. నీరసింపజేస్తుంది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయే పరిస్థితి కల్పిస్తుంది.
లక్షణాలు
వైరస్‌ సోకిన వెంటనే అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు ఉండి, మనిషి కదలలేని స్థితి ఏర్పడుతుంది. తలనొప్పి, నిద్రలేమి బాధిస్తాయి. వ్యాధి తీవ్రత 5 నుంచి 7 రోజుల వరకూ ఉంటుంది.
జాగ్రత్తలు
శరీరంలోని ద్రవాలూ, లవణాలూ తగ్గిపోతాయి గనుక ఆహార పానీయాలు సక్రమంగా తీసుకోవాలి. లేకపోతే ప్రాణాపాయానికి దారితీస్తుంది. దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలి. నీళ్లు నిలువ ఉండకుండా జాగ్రత్త వహించాలి.
నివారణ
వ్యాధి సోకకముందు అయితే, యుఫటోరియం పర్ఫోరేటం అనే మందును వారానికి ఒక రోజు, మూడు పూటలు తీసుకోవాలి. ఇలా వ్యాధి ప్రబలి ఉన్నంత కాలం తీసుకోవాలి. వ్యాధి సోకిన తర్వాత ఆయా లక్షణాలను బట్టి రస్టాక్స్‌, బ్రయోనియా అనే మందులను రోజుకు మూడుసార్లు, మూడు రోజులు వాడితే వ్యాధి తీవ్రత తగ్గుతుంది.
మలేరియా
మలేరియా జ్వరం ప్రతియేటా వర్షాలు పడిన తర్వాత, దోమలవల్ల వ్యాప్తి చెందుతోంది. మలేరియా ప్రోటోజోవా జీవి అయిన ప్లాస్మోడియం ద్వారా సోకుతుంది. ఆడ ఎనాఫిలిస్‌ దోమ కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు
తీవ్రమైన జ్వరంతోపాటు చలి ఎక్కువగా ఉంటుంది.
జాగ్రత్తలు
దోమలను నివారించడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. దోమ తెరలు వాడాలి. నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి.
నివారణ
చైనా, చినూనమ్‌ ఆర్స్‌, మలేరియా అఫిసినా లిస్‌, సల్ఫర్‌ అనే మందు లు మలేరియా నివార ణకు పనిచేస్తాయి.
అతిసార
ఇది వర్షాకాలంలో కలుషిత నీటి ద్వారా ఎక్కువగా ప్రబలుతుంది. ఈ వ్యాధికి గురైన వారికి ఉన్నట్లుండి వాంతులూ, విరేచనాలూ అవుతాయి.
కొందరిలో జ్వరం రావడం, విపరీతమైన కడుపునొప్పి రావడం, నోరు ఎండిపోవడం, కాళ్లు లాగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధిలో ప్రధానంగా వాంతులూ, విరేచనాలూ తొందరగా తగ్గించడానికి మందులు వాడాల్సి ఉంటుంది.
లక్షణాలు
వాంతులూ, విరేచనాలూ ఉన్నట్లుండి ఒకేసారి పెద్దమొత్తంలో అవుతాయి. తద్వార శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్‌ స్థితి ఏర్పడుతుంది. ఇలాంటి స్థితిలో చర్మాన్ని పైకి లాగి, వదిలితే అలాగే ఉండిపోతుంది. వృద్ధుల్లో చర్మం ముడతలు పడి ఉంటుంది. కళ్లు గుంటల్లాగా మారి, బాగా నీరసించి పోతారు. అతిసార వ్యాధి తీవ్రమైనప్పుడు నాడి వేగమూ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నాడి తెలియని పరిస్థితి దాపురిస్తుంది.
రక్తపోటు తగ్గిపోతుంది. దీనిని నమోదు చేయలేని స్థితికీ మారవచ్చు. వ్యాధి తీవ్రమైతే శరీరం చల్లబడి, రోగి అపస్మారక స్థితిలోకీ, కోమాలోకి వెళ్లి మరణించే అవకాశం ఉంటుంది.
నివారణ
అతిసార వ్యాధివల్ల శరీరం నీటినీ, లవణాలనూ అత్యధికంగా కోల్పోతుంది. కనుక ఈ వ్యాధికి గురైన రోగికి వెంటనే ద్రవ పదార్థాలు ఇవ్వాలి.
కొబ్బరినీళ్లు, మంచినీరు, మజ్జిగ మొదలైనవి ప్రారంభం నుంచీ ఇవ్వాలి.
డీహైడ్రేషన్‌ నివారణకు కాచి, చల్లార్చిన ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల పంచదార, చిటికెడు ఉప్పు కలిపి ఇవ్వాలి. లేకపోతే ఓరల్‌ రీ హైడ్రేషన్‌ సొల్యూషన్‌ ఇవ్వాలి.
అతిసార వ్యాధికి గురైన వ్యక్తి నోటితో ద్రవ పదార్థాలు తీసుకోగలిగినంత వరకూ సెలైన్‌ అవసరం రాదు.
ఆ విధంగా తీసుకోలేని స్థితిలో ఇంట్రావీనస్‌ ద్వారా డాక్టర్ల సమక్షంలో సెలైన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.
మందులు
హోమియో మందులను వ్యాధి లక్షణాల ఆధారంగా వాడవలసి ఉంటుంది. ముఖ్యంగా పోడోపైలం, ఆర్సినిక్‌ ఆల్బ్‌, కాంఫర్‌, వెరాట్రం ఆల్బం, చైనా, ఇపికాక్‌ వంటి మందులను వాడితే అతిసార వ్యాధి నివారించవచ్చు.

డాక్టర్‌ పావుశెట్టి శ్రీధర్‌
హోమియో ఫిజీషియన్‌
హన్మకొండ 

ఉద్యోగినులకే వ్యాధులెక్కువ!


భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే ఆర్థికంగా బోలెడంత వెసులుబాటు. నేటి ఆర్థిక పరిస్థితుల రీత్యా వేన్నీళ్లకు చన్నీళ్లలా దేనికో దానికైనా వస్తాయనీ ఈ రోజుల్లో ఎంత చిన్న ఉద్యోగమైనా మహిళలు చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఉద్యోగం చేసే మహిళలకు జీవనశైలి రుగ్మతల తాకిడి ఎక్కువని నిపుణులు అంటున్నారు. ఉద్యోగం చేసే మహిళల్లో 68 శాతం మంది తీవ్రస్థాయి ఒత్తిడితో జీవనశైలి రుగ్మతల బారిన పడుతున్నారని భారత పరిశ్రమల సంస్థ 'అసోచామ్‌' చేపట్టిన ఒక సర్వేలో వెల్లడైంది. పట్టణ భారతంలో 27 శాతం మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. 21-52 సంవత్సరాల మధ్య వయసుతో ఉద్యోగాలు చేస్తున్న మహిళలపై ఈ సర్వే చేపట్టారు. ఇందులో 68 శాతం మంది జీవనశైలి కారణంగా తలెత్తే స్థూలకాయం, కుంగుబాటు, దీర్ఘకాలిక నడుమునొప్పి, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలతో సతమతమవుతున్నట్లు గుర్తించారు. ఈ సర్వేను దేశవ్యాప్తంగా 11 రంగాలకు చెందిన 72 కంపెనీల్లో చేపట్టారు. ఎక్కువ సమయం పనిచేయాల్సి రావటం, స్పష్టమైన సూచనలు లేకుండా నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించటం వల్ల 75 శాతం మహిళా ఉద్యోగులు కుంగుబాటు, ఆందోళనతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, నిర్దేశిత లక్ష్యం కారణంగా తరచూ భోజనం మానేయటం, చిరుతిండిపై ఆధారపడటం పెరుగుతున్నట్లు 52 శాతం మంది వెల్లడించారు. నిద్ర సరిగా లేకపోవటం, కాలుష్యం, వ్యాయామం లేకపోవటం, సూర్యరశ్మి తగలకపోవటం, పోషకాహారం అందకపోవటం వంటివన్నీ వీరికి సమస్యలుగానే పరిణమించాయని తేలింది. వీరిలో ఎక్కువమంది అనారోగ్య సమస్యలు వచ్చినా, వైద్యుల్ని సంప్రదించకుండా తోసిరాజని తిరుగుతున్నట్లు గుర్తించారు.

25, సెప్టెంబర్ 2013, బుధవారం

ఆయాసం తగ్గడానికి...


మనం ముక్కు ద్వారా తీసుకుని వదిలే గాలి మన ప్రయత్నం లేకుండా మనకి తెలియకుండా జరిగే ఒక నిరంతం సాగే ప్రక్రియ. అయితే ఎక్కువగా అందిరి పిల్లలలో వుండే సమస్య ఆయాసంగా మారింది. చిన్నప్పటి నుంచి శ్వాస మండలిలో సమస్యలు మొదలు అవుతున్నాయి. ఇలాంటి సమస్యలు వంశపారంపర్యంగా రావచ్చు. కానీ ఎక్కువ శాతం వాతావరణం వల్లనో లేదా పరిస్థితుల కారణంగా కూడా వస్తాయి.శ్వాస మండలంలోని గాలి వెళ్లే మార్గంలో గోడలు దగ్గరగా కుంచించుకుని గాలి వెళ్ళకుండా అడ్డుకోవడం వల్ల సమస్య తలెత్తడం జరుగుతుంది.
అంతేకాదు శ్వాసక్రియలో ప్రధానంగా ఉండే ఊపిరితిత్తుల లోని పొరలు ఏ కారణం చేతనైనా రేగడం వల్ల కూడా ప్రధానంగా రావచ్చు. ఈ శ్వాసక్రియలో ప్రధానంగా ఉండే సమస్యల వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంటుంది.ఆయాసం ఉన్న పిల్లలు చాలా మంది ముక్కుతో ఊపిరి పీల్చుకోకుండా నోటితో పీలుస్తూ ఉంటారు. దీనికి కారణమేమిటంటే అక్కడి శ్వాసమండలిలోకి గాలి వెళుతున్న మార్గం మూసుకుపోవడం వల్ల గాలి ముక్కుతో పీల్చుకోలేక నోటితో పీల్చడం జరుగుతుంది. గాలి పీల్చలేకపోవడం వల్ల పిల్లలకు అయినా పెద్దలకైనా సరే నోటితో పీలుస్తారు. దీనితో పిల్లలు మరింత నీరసించి పోతారు. ముక్కు గొంతు జీర్ణాశయం వ్యాధుల వల్ల కూడా ఆయాసం తలెత్తవచ్చు. అయితే కొంతమందిలో కొన్ని పదార్ధాల వాసనలు, వాతావరణం పడవు. దాన్ని ఎలర్జీ అంటారు. దీని వల్ల కూడా గాలి అరలు దగ్గరగా సంకుచితమై ఆయాసం వస్తుంది. అతి నీరసం వల్ల రక్తం తగ్గినప్పుడు పాండు వ్యాధిలోనూ కూడా ఆయాసం వచ్చే అవకాశం ఉన్నది.

ఆయాసంగా ఉన్నవారు చల్లటి పదార్ధాలు, కూల్‌డ్రింక్‌, ఐస్‌ క్రీమ్‌లు, బెండకాయ, చేయదుంప, పెరుగు, కొబ్బరి,చేపలు, సొరకాయ, దుంపకాయలు, బచ్చలి కూర ఎక్కువగా పుల్లగా ఉన్న పదార్ధాలకు దూరంగా ఉండాలి. ముల్లంగి దుంప, గోధుమలు లేదా గోధుమపిండి, తేనే, వెల్లుల్లి నిరభ్యంతరంగా తినవచ్చు.అదే విధంగా ప్రతి రోజూ ఉదయం లేచిన అనంతరం ఉదయం, సాయంత్రం చిటికెడు పసుపు, ఒక చిటికెడు మెత్తని ఉప్పు,రెండు చిటికెల పిప్పళ్ళ చూర్ణం తిని వేడినీళ్ళు తాగడం మంచిది. దీని వల్ల క్రమంగా ఎలుర్జీ తగ్గిపోతుంది. అంతేకాకుండా ఉసిరికాయ పెచ్చులు, వరిపేలాలు, పటిక బెల్లం, నువ్వుపప్పు, నెయ్యి అన్నింటిని సమభాగాలుగా తీసుకుని వాటిని మర్దించి చిన్న చిన్న మాత్రలుగా చేసుకుని ఉదయం సాయంత్రం తీసుకుంటే క్రమంగా ఆయాసం తగ్గుతుంది. వేడి వేడి టి డికాషన్లో తొమ్మిది చుక్కలు నిమ్మరసం వేసుకుని తేనెకూడా కలుపుకుని వేడివేడిగా తాగాలి. దీని వలన ఉబ్బసం ఉన్నవారికి చాలా వరకు ఇది కూడా మందుగా పనిచేస్తుంది.

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను దూరం చేసుకోండి!


జిమ్‌కు వెళ్లి తెగ ఎక్సర్‌సైజ్‌ చేస్తున్నారా.. ఇలా జిమ్‌లకు వెళ్లి గంటల పాటు వ్యాయామం చేసేకంటే ఇంటి పని చేస్తే అనేక రోగాలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంటి పని చేయడం ద్వారా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చునని వారు చెబుతున్నారు.

ఇంకా వారంలో ఐదు రోజులు 30 నిమిషాల పాటు హుషారుగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇంటిపనితో పాటు ఓ అరగంట వ్యాయామానికి మాత్రం కేటాయించడం.. ఇలా చేస్తే బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో పాటు గుండెపోటును కూడా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇంటి పనులు అంటే మీ పెట్స్‌తో కలిసి వాకింగ్‌ చేయడంతో పాటు లిఫ్‌‌టలకు బదులు మెట్లను ఉపయోగించడం, బస్సు ప్రయాణం చేస్తే ముందు బస్టాప్‌లో దిగి నడిచి వెళ్లడం చేయాలి. అంతేగాకుండా ఎప్పుడు హుషారుగా ఇంటి పని చేసే మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ముప్పు చాలా తక్కువగా ఉందని యూరోప్‌ అధ్యయనంలో తేలింది.

పసుపుతో సౌందర్యము ఎలా వస్తుంది?


నుదుట బొట్టు, ముఖానికి పసుపు రాసుకుంటారు భారతీయ మహిళలు. కానీ అదే పసుపు ఎన్నో రకాల వ్యాధులను నివారిస్తుందని వారికి తెలీదు. యాంటీ బయోటిక్‌గా ఉపయోగపడే ఈ పసుపుతో చిట్కాలు...

పసుపు, చందనం రెండింటిని పాలమీది మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకొని తర్వాత చన్నీళ్ళలో శుభ్రంగా కడిగిన ముఖ ఛాయ పెరుగుతుంది. శరీరం కాంతివంతం అవుతుంది. పసుపు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది. పసుపు, వేపచెక్క పట్టచూర్ణం, కరకాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని 2 గ్రాముల చొప్పున వాడితే చర్మవ్యాధులు, క్రిమిరోగాలు నయనమవుతాయి.పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్ళు, మరియు దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకొని దీర్ఘకాలంగా ఉన్న వ్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి. పసుపు, తులసి ఆకులరసం కలిపి పట్టువేస్తే దీర్ఘకాలిక
వ్రణాలు మానిపోతాయి.

మహిళలు నడుము నొప్పితో బాధపడతారు


 నడుమునొప్పి గురించి విననివారు, దీని బారిన పడనివారు ఉండరు. ముఖ్యంగా 2/3 మంది 20 సంవత్సరాలు దాటినవారిలో చూస్తాం. ముఖ్యంగా మహిళలలు ఈ నొప్పితో ఎక్కువగా బాధపడతారు. వారి జీవనవిధానం ప్రెగ్నెన్సీ, డెలివరీ ఇంటి పనులు తీవ్రతను పెంచుతాయి.
 
 డాక్టరు దగ్గరికి వెళ్ళేవారిలో ప్రతి ముగ్గురిలో స్త్రీలు ఒకరు తప్పక ఉంటారు. పనిచేయలేకపోతారు. దీనికి విశ్రాంతి అవసరం. అందువలన స్త్రీలు ఈ కారణంగా  సెలవు తీసుకుంటారు. అధికంగా పనిదినాలు దీనివలనే వృధా అవుతుంటాయి. నడుమునొప్పి వ్యాధి కాదు. వ్యాధి యొక్క లక్షణాలు మాత్రమే. ఇది చాలా వ్యాధులలో సర్వసాధారణంగా కనబడుతుంది. చిన్న జ్వరం నుండి బాధించే ప్యాసెట్ సైనొవియల్ సిస్ట్ (facet synovial cyst).
 
 నడుమునొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. శరీరశ్రమ, పనిఒత్తిడి, మానసిక ఆందోళనలు కూడా కారణం అవుతాయి. మనం ఈ నొప్పిని మూడు విధాలుగా విభజించవచ్చును. సిస్టమ్ డిసీస్, స్ట్రెస్, టెన్షన్ వలన లేదా న్యూరలాజికల్ ప్రాబ్లమ్ వలన సామాన్యంగా నొప్పితో బాధపడే ప్రతి 10 మందిలో, ఆరుగురు నడుంనొప్పితో బాధపడుతున్నవారే.
 
 సన్నని నొప్పి, ఆగకుండా కలిగే నొప్పి, ఉప్పెన మాదిరిగా వచ్చే నొప్పి, కూర్చుంటే కలిగే నొప్పి, టూవీలర్ నడిపితే కలిగే నొప్పి, గృహిణిలకు పనివలన కలిగే నొప్పి, పెద్దవారికి టీవీ చూస్తే నొప్పి, స్కూలు పిల్లలకు బ్యాగులు మోసి (బుక్స్) నొప్పి, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కూర్చుంటే నొప్పి, వ్యాపారులకు, ఉద్యోగులకు, రాజకీయనాయకులకు, రైతులకు పొలాలలో నొప్పి, నాట్యకళాకారులకు నాట్యంలో నొప్పి, వృద్ధులకు పడుకుంటే నొప్పి... అందరినీ భాదించే నొప్పి నడుమునొప్పి.
 
 వివిధ కారణాలు
 స్వల్పకాలిక నొప్పి, కొన్ని రోజులు, కొన్ని వారాలు ఉండే నొప్పి ముఖ్యంగా గాయాలు, వెన్నుపూస వాపు, కండరాల శ్రమ, ఆటలలో గాయాలు, అలసట, తోటలో పనిచేయడం, బరువులు ఎత్తటం, నొప్పి, ఆకస్మాత్తుగా తీవ్రంగా పొడిచినట్లుగా ఉంటుంది.
 
 కదలికలలో నిర్బంధం. ఫ్రీగా తిరగలేరు. కండరాలు పట్టివేసినట్లు ఉంటుంది. నిటారుగా నిలబడలేరు. చక్కగా పడుకోలేరు.
 
 దీర్ఘకాలిక నొప్పి: మూడు నెలల కంటే ఎక్కువైతే కారణాలు వేరుగా ఉంటాయి. వివిధరకాలుగా ఈ నొప్పి వివిధ భాగాలలో ఉంటుంది. వెన్నుపూసలో మార్పుల వలన వచ్చే నొప్పులు.
  డిస్క్ (వెన్నుపూస) సమస్యలు - డిస్క్ హెర్నియేషన్
  డిస్క్ బల్జ్ (వాపు) - డిస్క్ ప్రాలాప్స్ (పక్కకు జరుగుట)
  నర్వ్ కంప్రెషన్ - కెనాల్ నారోయింగ్
  డిస్క్ లైసిస్   - డిస్క్ ట్రోమ
  డిస్క్ ఫ్రాక్చర్స్ - డిస్క్ సిండ్రోమ్స్
  స్పైనల్ టీబీ - ఆస్టియో పోరోసిస్
  డిస్క్‌వాపు, - ఆర్ట్రైటిస్
 
 డిస్క్ (వెన్నుపూస) వాపు, పక్కకు జరుగటం... వంటి వాటికి కలిగే బాధలు: 
 వెన్నుపూసల మధ్యన ఉండే జిగురుపదార్థం తగ్గి పక్కకు జరుగుతుంది. అప్పుడు నడుమునొప్పి పిరుదుల నుండి కాళ్ళ వరకు పాకుతుంది. మెడనొప్పి, భుజాలు, చేతులు తిమ్మిర్లెక్కి, మొద్దుబారిపోవటం, కండరాల పట్టు తగ్గుటం, వణకటం చూస్తాం.
 
 రోగ నిర్ధారణ
 ఎక్స్-రే   
 ఎమ్‌ఆర్‌ఐ 
 సీటీ స్కాన్
 
 హోమియో చికిత్స
 హోమియో వైద్యం ద్వారా కండరాల, కీళ్ళ, నరాల సంబంధ వ్యాధులకు స్టార్ హోమియోపతిలో నవీన చికిత్స కనుగొనబడింది.
 
 నూతన పరిశోధన ఫలితాలను అనుసరించి శారీరక, మానసిక విశ్లేషణ, కారణం, రోగ లక్షణాలు, మూలకారణాలు... వీటిని బట్టి హోమియో మందులు సూచింపబడును.
 
 వాడదగిన హోమియో మందులు
 రస్టాక్స్: కండరాల, కీళ్ళ నొప్పులు, కదలికలలో నిర్బంధు (స్టిఫ్‌నెస్) చల్లటి గాలి వలన, తేమ వలన వచ్చేనొప్పి, నడుమునొప్పి, కీళ్ళ నొప్పులు.
 
 కార్నికం: గాయాలు, బెణుకుట... వలన కలిగే నొప్పి, జ్వరం, కీళ్ళ నొప్పులు వాపు, నడకతో పెరిగే నొప్పులు.
 
 సిమిసిప్యూగా: స్త్రీల సంబంధ నొప్పులు, మెన్సెస్ టైమ్‌లో పెరిగే నొప్పులు, వాతావరణ మార్పుల వలన కలిగే నొప్పులు.
 
 కాస్టకమ్: కండరాల పటుత్వం, నిర్బంధం, కీళ్ళ వాపు, కండరాల క్షీణత, ఎక్కువ చలి, వేడి పడదు. నడకతో పెరిగే నొప్పి.
 
 అకొనైట్: ఉప్పెనలాంటి నొప్పులు, భయం, ఆందోళన విపరీతమైన నొప్పి, ప్రాణభయం, నరాల సంబంధ నొప్పులు.
 
 బెల్లడొనా: కీళ్ళ వాపు, కండరాల నొప్పి, తీవ్రంగా, సడెన్‌గా వచ్చే నొప్పి, జ్వరం కండరాలు పట్టేయటం, స్పాజెర్స్.

పెయిన్ మేనేజ్‌మెంట్: నొప్పి నూరు విధాల మేలు..!

 శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే మొదట కలిగే అనుభూతి నొప్పి. బహుశా... ఓ చిన్నారికి మొదట కలిగే అన్ని అనుభవాల్లో నొప్పే మొదటిదేమో? ఎందుకంటే మాట రాకముందు... బోర్లా పడేటప్పుడో, పారాడే వేళలోనో తగిలించుకునే మొదటి దెబ్బ ఆ చిన్నారికి నొప్పిని నేర్పుతుంది. నొప్పే లేకపోతే మనిషి మనుగడే కష్టమవుతుంది. నొప్పి బాధను అనుభూతించిన అనుభవంతోనే మనిషి కొన్ని ప్రమాదాల నుంచి అనుక్షణం అప్రమత్తంగా ఉంటాడు. ఒకవేళ నొప్పి కలిగితే ఆ అవయవానికి విశ్రాంతినిచ్చి అది కోలుకునేందుకు అవకాశమిస్తాడు. అందుకే నొప్పిని గురించి తెలుసుకోవడం అంటే మన మనుగడ గురించి తెలుసుకోవడమే. అలా తెలుసుకోవడం కోసమే ఈ కథనం.

 ఏదైనా గాయమైతే మనకు వెంటనే నొప్పి తెలుస్తుంది. ఇలా నొప్పి కలిగిన వెంటనే మనం ఆ శరీరభాగంతో పనిచేయించకుండా జాగ్రత్తపడతాం. ఒకవేళ పనిచేయించబోయినా ఆ అవయవం నొప్పి కారణంగా సహకరించదు. ఫలితంగా గాయం తగ్గే సమయంలో ఆ అవయవానికి కోలుకోడానికి అవసరమైన విశ్రాంతి దొరుకుతుంది. అలా క్రమంగా గాయం తగ్గుతున్న కొద్దీ నొప్పి కూడా క్రమేణా తగ్గుతూ పోతుంది. ప్రకృతి మన మనుగడ కోసం చేసిన ఏర్పాటిది.

 ఎలాంటి నొప్పి అయినా సాధారణంగా వారం నుంచి రెండు వారాల్లో తగ్గిపోతుంది. అంటే ఒక గాయం తగ్గడానికి పట్టే వ్యవధి అదన్నమాట. ఏదైనా అవయవానికి గాయం కాగానే అక్కడి కణాలకూ, కణజాలానికీ దెబ్బ తగిలిందంటూ మెదడుకు సమాచారం వెళ్తుంది. ఆ తర్వాత అదేచోట తగిలే చిన్నచిన్న దెబ్బలకూ లేదా విఘాతాలకూ మళ్లీ నొప్పి తిరగబెడుతుంటుంది. అంటే ఆ అవయవాన్ని జాగ్రత్తగా చూసుకునేలా నొప్పి కలిగించే నరాలు హెచ్చరిక చేస్తుంటాయన్నమాట. ఇలా నొప్పి కలిగించే నరాల కారణంగా మనకు బాధ తెలుస్తుంటుంది. ఒకవేళ ఇలా నొప్పి తెలియకపోతే మనం అదే అవయవం చేత మళ్లీ మళ్లీ పని చేయించి, దాన్ని పూర్తిగా పనికిరాకుండా చేసుకునేందుకు అవకాశం ఉండబట్టే మనకు నొప్పి అనే రక్షణవ్యవస్థను ఏర్పాటుచేసింది ప్రకృతి.

 ఒక్కోసారి మనకు కలిగే నొప్పి మనకు మేలుచేయడం కంటే, ఇబ్బందిని, చికాకును కలిగించడం కూడా జరగవచ్చు. ఉదాహరణకు ఒకచోట దెబ్బ తీవ్రత ఎక్కువగా లేదు. అయినా నొప్పి కలుగుతూ ఉంటే... దాన్ని భరించడం కంటే తొలగించుకోవడం మేలు. అందుకు ఉపయోగపడేదే నొప్పి నివారణ చికిత్స.

 ఎందుకీ నొప్పి నివారణ చికిత్స...?
 నొప్పి కలగాల్సినచోట కలగడం వల్ల ఒక రక్షణ కలుగుతుంది. కానీ అదే నొప్పి అదేపనిగా కొనసాగుతూ పోతే ఎన్నో విలువైన మానవ పనిగంటలు వృథా అవుతాయి. అందుకే పనివేళల్లో కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు చాలామంది నొప్పి నివారణ మందులు మింగుతూ, నొప్పి నివారణ చికిత్స ఎవరికి వారు చేసుకుంటుంటారు. కుదరకపోతే డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ చికిత్స తీసుకుంటూ ఉంటారు. నొప్పి నుంచి విముక్తం కావడం అన్నది మనిషి హక్కు.

 నొప్పికి ఎలా చికిత్స చేస్తారు?
 నొప్పికి చాలారకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. సాధారణంగా నొప్పి నివారణ మాత్రలు వాడటం అన్నది సర్వసాధారణంగా చాలామంది అవలంబించే ప్రక్రియే. అయితే దీనితో పాటు వేడినీటి కాపడం, చన్నీటి కాపడం (హాట్ ప్యాక్, కోల్డ్ ప్యాక్) వంటివీ ప్రకృతిచికిత్సలో భాగంగానూ, చాలా సందర్భాల్లో అల్లోపతిలోనూ చేస్తుంటారు. కొంతమంది ఉప్పును కాచి, గుడ్డలో కట్టి అద్దుతుంటారు. ఇది కూడా ఒక రకమైన హాట్ ప్యాక్ అనుకోవచ్చు. అయితే శాస్త్రవిజ్ఞాన నిరూపితమైన మార్గం ఏమిటంటే... నొప్పికి కారణమైన అంశాన్ని తొలగించడం ద్వారా నొప్పిని శాశ్వతంగా తొలగించవచ్చు. ఇది సురక్షితమైన ప్రక్రియ. ఈలోపు నొప్పిని ఉపశమింపజేయడానికి వాడేవన్నీ తాత్కాలికమైన నొప్పి నివారణ ఔషధాలే. ఇవి దీర్ఘకాలికంగా వాడితే అనేక అంతర్గత అవయవాలకు ముప్పు. అందుకే సమస్య ఏదైనా ఉన్నప్పుడు దాన్ని విస్మరించి కేవలం నొప్పి నివారణ మందులను వాడుతూ పోతే అది కిడ్నీలను దెబ్బతీయడం, కాలేయానికి విఘాతం కల్పించడం వంటి దుష్పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే నొప్పికి కారణమైన అంశాన్ని కనుగొని, అందుకు అవసరమైన పూర్తి చికిత్స తీసుకోవాలి. ఇదే సురక్షితమైన మార్గం. దీనివల్ల నొప్పి పూర్తిగా తగ్గడం, మళ్లీ రాకుండా ఉండటంతో పాటు జీవన నాణ్యత సైతం పెరుగుతుంది.

 నొప్పి నివారణకు తోడ్పడే వైద్య పరీక్షలు / ప్రక్రియలు
 శాశ్వత నొప్పి నివారణ కోసం మనం ముందుగా అనుకున్నట్లుగా నొప్పికి కారణమైన అంశాన్ని కనుగొనాలి. అందుకోసం మనకు అనేక వైద్య పరీక్షలు ఉపయోగపడతాయి. అందుకే వాటిని పరోక్షనొప్పి నివారిణులు అనుకోవచ్చు. అందులో ముఖ్యమైనవి... ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటివి. వీటితో పాటు లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్ల వంటివి (నొప్పి వచ్చిన చోట అక్కడ స్థానికంగా ఉండే నొప్పిని తెలిపే నరాలను మొద్దుబార్చేలా చేసి నొప్పి తెలియకుండా చేస్తాయి) తాత్కాలిక మార్గాలు.

 ఇక శాశ్వతంగా నొప్పి లేకుండా చేయడానికి అనేక మార్గాలున్నాయి. నొప్పిని మెదడుకు చేరవేసి, నొప్పి తెలిసేలా చేసే నరాలను మార్గ మధ్యంలోనే... అంటే అధునాతన ప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల సహాయంతో నొప్పిని ఆపేయవచ్చు. ఇక వెన్నెముక వద్దే నొప్పిని తెలిపే సిగ్నళ్లను ఆపేసే ప్రక్రియలూ ఉన్నాయి. ఇంజెక్షన్ల విషయానికి వస్తే నొప్పుల్లోని రకాలను బట్టి వాటి నివారణకు అవసరమైనవి వందల రకాలు అందుబాటులో ఉన్నాయి.

 పెయిన్ క్లినిక్స్
  ఇప్పుడు తాత్కాలిక, దీర్ఘకాలిక నొప్పి నివారణకు ప్రత్యేకంగా నొప్పి నివారణ క్లినిక్స్ అందుబాటులోకి వచ్చాయి/వస్తున్నాయి. నొప్పిని నియంత్రించేందుకు ప్రత్యేకమైన డాక్టర్లు ఉన్నారు. వీళ్లు నొప్పి నివారణ ప్రక్రియలు / పద్ధతుల్లో దీర్ఘకాలికంగా ప్రత్యేకశిక్షణ పొంది ఉంటారు.

 నొప్పి నివారణ జరగాల్సిన తక్షణ అవసరాలు
 క్రికెట్ ఆటలో ఎవరైనా గాయపడగానే పరుగుపరుగున శిక్షణ పొందిన నిపుణులు, ఫిజియోలు వచ్చేస్తుంటారు. అంటే ఆటల్లో తగిలే దెబ్బల కారణంగా నొప్పిని తక్షణం నివారించడం అవసరమవుతుంది. అలాగే కొన్నిసందర్భాల్లో ఆటగాళ్లకు దీర్ఘకాలికమైన నొప్పులు కలుగుతుంటాయి. వీటికోసం వారు నొప్పి నివారణ (పెయిన్ మేనేజ్‌మెంట్) స్పెషలిస్టులను సంప్రదిస్తుంటారు. ఇదేగాక ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, ప్రకృతి వైపరిత్యాలు, ఉత్పాతాల సమయంలో అత్యవసరంగా చేయాల్సింది నొప్పినివారణే. అందుకు తక్షణం అవసరమయ్యేది నొప్పి నివారణ స్పెషలిస్టులే.

 నొప్పి నివారణతో సంబంధం ఉండే ఇతర స్పెషాలిటీస్...
 నొప్పి నివారణ మాత్రమే గాక... దీనితో పాటు వైద్య విభాగంలోని మరికొన్ని ప్రత్యేక విభాగాలూ పనిచేయాల్సి ఉంటుంది. అంటే నొప్పిని తగ్గించగానే సరిపోదు. దానికి కారణమైన అంశాన్ని పూర్తిగా నయం చేయాలి. ఇందుకోసం అవసరమైన ఆయా విభాగాలకు చెందిన ప్రత్యేక నైపుణ్యంగల డాక్టర్లు ఆయా బాధ్యతలను నిర్వహిస్తారు. ఇక నొప్పి నివారణ కార్యకలాపాల్లో నొప్పి నివారణ స్పెషలిస్టులతో పాటు అవసరాన్ని బట్టి ఫిజియోథెరపిస్టులు, నొప్పి పూర్తిగా తగ్గాక రోగిలో కలిగిన వైకల్యాన్ని బట్టి అతడికి తగిన వృత్తిని ఎంచుకునేందుకు సహాయపడే ఆక్యుపేషనల్ థెరపిస్టులు, అవసరాన్ని బట్టి సైకాలజిస్టు వంటి వారు పేషెంట్‌కు సహాయపడతారు. నొప్పి త్వరగా తగ్గడానికి అవసరమైన వ్యాయామాలను ఫిజియో థెరపిస్టులు సూచిస్తారు. వారికి అవసరమైన ఆహారాన్ని డైట్ స్పెషలిస్టులు లేదా న్యూట్రిషనిస్టులు చెబుతారు. ఇక నొప్పి నివారణలో భాగంగా జీవనశైలిలో మార్పులు (లైఫ్‌స్టైల్ మాడిఫికేషన్స్), పనిచేసే చోట నొప్పికి ఆస్కారం లేకుండా అనువైన విధంగా కూర్చోవడం, ఉపకరణాలు, అమరికలను ఎర్గానమిస్టులు సూచిస్తారు. దీనితోపాటు పని పూర్తయ్యాక విశ్రాంతి చర్యలను, ఒత్తిడికి గురికాకుండా ఉండే మార్గాలను (రిలాక్సేషన్ టెక్నిక్స్) సైతం నిపుణులు సూచిస్తుంటారు.


 నొప్పి గురించి కొన్ని విషయాలు...
 మీకు తెలుసా...? ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఒక ఏడాదిలో నొప్పి నివారణ కోసం 100 బిలియన్‌ల (పది వేల కోట్ల) పెయిన్‌కిల్లర్స్ మింగుతారట. వాటిని ఒక లైన్‌లో పేర్చితే 10 లక్షల కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంటే అలా పేర్చుకుంటూ పోతే చంద్రుడి వరకు వెళ్లి... మళ్లీ వెనక్కు భూమికి చేరుకోవచ్చట.

 త లోకంలో ఏ సమయంలోనైనా ప్రపంచ జనాభాలో 20 శాతం మంది ఏదో ఒక నొప్పితో బాధపడుతూనే ఉంటారు. ఇందులో 20 కోట్ల మంది దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతూ ఉంటారు. మిగతావారు తాత్కాలిక నొప్పులతో ఉంటారు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రతిరోజూ దాదాపు పదిలక్షల మంది ఏదో ఒకరకమైన నొప్పితో బాధపడుతుంటారని అంచనా .

  కొంతమందిలో కొన్ని జన్యుపరమైన సమస్యల కారణంగా ఎముకలు విరిగినా, గాయాలైనా లేదా అవే గాయాలపై మళ్లీ దెబ్బ తగిలినా నొప్పి తెలియదు. దీనికి కారణం వాళ్లలో నొప్పిని తెలిపే నరాలు క్రియాశీలంగా లేకపోవడమే. పుట్టుకతోనే వచ్చే జన్యుపరమైన ఈ సమస్యను కంజెనిటల్ ఇన్‌సెన్సిటివిటీ టు పెయిన్ అండ్ అన్‌హైడ్రోసిస్ (సిపా) అంటారు. ఇది హెరిడిటరీ సెన్సరీ అటనామిక్ న్యూరోపతి (హెచ్‌ఎస్‌ఏఎన్) అనే నొప్పి తెలియని  రుగ్మతల్లో ఒక రకం  జంతువులకూ నొప్పి తెలుస్తుంది. అందుకే మన పెంపుడు జంతువులు గాయపడినా లేదా వాటికి కాళ్లు విరిగినా తగిన చికిత్స చేశాక... వైద్యులు వాటికి నొప్పి నివారణ మందులు ఇవ్వరు. ఎందుకంటే... దెబ్బ తగిలిన అవయవానికి తగిన విశ్రాంతిని, జాగ్రత్తను కల్పించాలన్న స్పృహ వాటికి ఉండదు. కాబట్టి నొప్పి తెలియకుండా ఉన్న కాలిని మామూలుగానే ఉపయోగిస్తాయి. అందుకే అవి గాయపడ్డా తగిన చికిత్స చేస్తారు తప్ప, నొప్పి తెలియకుండా ఉండే ఇంజెక్షన్లను ఇవ్వరు.

 డాక్టర్ పి. విజయానంద్
 పెయిన్ మేనేజ్‌మెంట్ నిపుణులు,
 కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.

 నిర్వహణ: యాసీన్

21, సెప్టెంబర్ 2013, శనివారం

పక్షవాతాన్నీ నివారించవచ్చు..!


ఏదో పని చేస్తున్న వ్యక్తి మాటల్లో ఉన్నట్లుండి తడబాటు కనిపించిందంటే... అది కచ్చితంగా పక్షవాతమయ్యుంటుందని అనుమానించవచ్చు. ఎవరో బలవంతంగా వంచేసినట్లు శరీరంలోని ఒక భాగం మెలిబడిపోతున్న భావన కలుగుతోందంటే అదీ పక్షవాతమేనని పసిగట్టవచ్చు. ప్రయాణం చేస్తున్నప్పుడు, పనిలో నిమగమైనప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఎప్పుడు ఈ విధమైన లక్షణాలు కనిపించినా పక్షవాతంగా అనుమానించి వెంటనే అన్ని సౌకర్యాలూ ఉన్న ఆస్పత్రికి తరలించడం మేలు.
ఉన్నట్లుండి మాట తడబడుతుంది. ఒక కాలూ, ఒక చేయీ పడిపోతుంది. మూతి వంకరపోతుంది. ఎవరో బలవంతంగా వంచేసినట్లు శరీరంలో ఒక భాగం మెలిబడి పోతుంది. ఇవన్నీ పక్షవాతానికి సంబంధించిన లక్షణాలే. రక్త నాళాల్లో ఎక్కడో కాస్తంత అడ్డు పడిన ఫలితమిది. పక్షవాతానికి గురైన వ్యక్తిని సరైన చికిత్స నిమిషాల్లో తిరిగి సాధారణ స్థితికి చేరుస్తుందంటు న్నారు సీనియర్‌ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ రణధీర్‌ కుమార్‌.
ఎందుకొస్తుంది?
మెదడులోని రక్తనాళంలో ఎక్కడైనా అడ్డంకి ఏర్పడితే, అది పక్షవాతానికి (హెమీ పెరేసిస్‌) దారి తీస్తుంది. ఒక కాలూ, ఒక చేయీ పడిపోతుంది. మూతి వంకర పోతుంది. దీంతోపాటు చాలా సందర్భాల్లో మాట కూడా పడిపోతుంది. అయితే కేవలం రక్తనాళంలో అడ్డంకి ఏర్పడడం ఒక్కటేగాక, వాటిలో ఒక్కోసారి ఒరిపిడి కారణంగానూ మెదడులో రక్తస్రావం కావడంవల్ల కూడా పక్షవాతం రావచ్చు.
పక్షవాతం రావడం హృద్రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వీరిలో గుండె రక్తనాళాల్లో ఉండిపోయిన కొవ్వు, ఒక్కోసారి రక్తనాళం ద్వారా మెదడులోకి చేరుతుంది. ఇదే పక్షవాతానికి దారితీస్తుంది. మరి పక్షవాతం రావడాన్ని ఎలా గుర్తించవచ్చునంటే... అందుకు సంబంధించి కొందరిలో అతి స్వల్పమైన కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మాట తడబడటం. రాస్తున్నప్పుడు చేతి కదలికల్లో ఏదో ఇబ్బంది ఏర్పడం వంటివి కనిపిస్తాయి. ఆ తరువాత ఓ రెండు గంటల తర్వాత ఆ వ్యక్తి మళ్లీ మామూలు స్థితికి చేరు కుంటాడు. ఈ విధంగా పరిస్థితి చక్కబడగానే సంతోషించి ఊరుకుంటే ప్రమాదమే. నిజానికీ మునుముందు ఒక తీవ్రమైన పక్షవాతం రాబో తోందని చెప్పే హెచ్చరికే అది. దీన్నే (టిఐఎ) ట్రాన్సియెంట్‌ ఇస్కీమిక్‌ అటాక్‌ అంటారు. అసలు ఆ లక్షణాలు కనిపించిన వెంటనే పూర్తి స్థాయి వైద్య చికిత్సలు తీసుకుంటే, తీవ్రస్థాయి పక్షవాతం ఏదీ రాకుండా నివారించవచ్చు. అందుకే పక్షవాతానికి సంబంధించిన అనుమానాలు వచ్చినా, అసహజమైన లక్షణాలేవైనా కనిపించినా వెంటనే న్యూరో ఫిజిషియన్‌ను సంప్ర దిస్తే యాంజియోగ్రఫీ ద్వారా సమస్యను కనుగొం టారు. సంబంధిత వ్యక్తికి గుండె సంబంధ మైన సమస్యలేమైనా ఉన్నాయేమో కూడా పరీక్షిస్తారు. మెదడుకు వెళ్లే ప్రధాన రక్తనాళంలో ఎక్కడైనా అవరో ధం ఏర్పడుతోందా? అన్న విషయాన్నీ పరిశీలిస్తారు.
నిమిషాల్లో....
సాధారణంగా వయసు పైబడటం, పొగ తాగడం, అధిక కొలిస్ట్రాల్‌, అధికరక్తపోటు, స్థూల కాయం వంటి సమస్యలుంటే... ఇవి రక్తనాళాల పరిధిని తగ్గిస్తూ వెళ్తాయి. క్రమంగా ఇవి రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటానికి దారితీస్తాయి. ఈ కారణాలతో వచ్చే పక్షవాతం (స్టోక్‌) గానీ మెదడులో రక్తస్రావం (హెమరేజ్‌)గానీ తలెత్తినప్పుడు నాలుగు గంటల్లోపే ఆస్పత్రికి చేర్చగలిగితే, వెంటనే యాంజియోగ్రఫీ చేసి, ఏ రక్తనాళంలో ఎక్కడ అడ్డంకి ఏర్పడిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ తరువాత క్లాట్‌ రిట్రాక్షన్‌ సిస్టమ్‌ ద్వారా ఆ అడ్డంకిని బయటికి లాగేసే ఏర్పాట్లు చేస్తారు. అందుకు అతి సూక్ష్మమైన ఒక పరికరాన్ని (కాథెడ్రాల్‌) రక్తనాళంలోంచి అడ్డంకి ఉన్న చోటికి పంపి, దాన్ని బయటికి లాగేస్తారు. ఇదేగాక టిపిఎ అనే విధానంలో అడ్డంకి తొలగిపోయేలా చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తికాగానే సహజ రీతిలో రక్త ప్రసరణ మొదలవుతుంది. ఫలితంగా అప్పటిదాకా కనిపించిన పక్షవాత లక్షణాలన్నీ క్షణాల్లో కనుమరుగై పోతాయి. ఒకప్పటి పక్షవాతం చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది ఎంతో పెద్ద ముందడుగు.
సమయమే ముఖ్యం
ఈ తరహా చికిత్సల్లో రోగిని ఎంత తొందరగా ఆస్పత్రికి తీసుకెళ్తారన్నది చాలా ముఖ్యం. నాలుగు గంటల్లోపే తీసుకొస్తే చాలా మంచిది. అలా వీలుకాని పరిస్థితుల్లో కనీసం ఆరు గంటలలోపైనా రోగిని ఆస్పత్రికి తరలించాలి. ఆ వ్యవధి కూడా దాటిపోతే రక్త ప్రసరణ అందని భాగంలో మెదడు కణాలు చనిపోవడం మొదలవుతుంది. దెబ్బతిన్న కణాల స్థానంలో కొత్తకణాలు ఉత్పన్నం కావడం గానీ, మెదడు కణాలను మార్చ డంగానీ సాధ్యం కాదు. కాబట్టి జరిగే నష్టం శాశ్వతంగా ఉండి పోతుంది. అందుకే నిర్ణీత వ్యవధిలో రోగిని ఆస్పత్రికి తరలించడం ఒక్కటే మెదడును కాపాడే ఏకైక పరిష్కారం. అలా అయితేనే రోగిని తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావడం సాధ్యమవుతుంది. అయితే కొందరిలో రక్తనాళంలో అడ్డుపడిన పదార్థం మరీ గట్టిగా ఉండి, బయటికిలాగడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి స్థితిలో ఆ భాగంలోకి ఒక బెలూన్‌ను లోనికి పంపి, రక్తనాళాన్ని వ్యాకోచింపజేస్తారు. ఆ వ్యాకోచం స్థిరంగా ఉండకపోతే, ఆ భాగంలో ఒక స్టెంటును కూడా అమర్చాల్సి ఉంటుంది. ఈ చికిత్సల్లో అడ్డు పడిన భాగం ఒరిపిడికి గురయ్యి, అందులో కొంత మెదడులోకి వెళ్లకుండా ఒక గొడుగులాంటి పరికరాన్ని లోపల అమరుస్తారు. ఈ చికిత్స లన్నీ సకాలంలో అంటే.. పక్షవాతం కని పించిన ఏడుగంటలలోపే రోగిని ఆస్పత్రికి తరలిస్తేనే సాధ్యమవు తాయి. నాలుగు గంటల్లోపే తీసుకువస్తే అది మరింత శ్రేయస్కరం. ఏదేమైనా ఈ కొత్త విధానాలు పక్షవాత చికిత్సలో ఒక పెద్ద ముం దడుగే. కాకపోతే వాటిని వినియోగించు కోవడంలో ఆలస్యం జరక్కుండా చూసుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేసినప్పుడు పక్షవాతానికి పరిష్కారం లభిస్తుంది.