27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఆరోగ్యం మన వంటింట్లోనే


 వంటగదుల్లోని మసాల దినుసుల్లో అద్భుతమై నది పసుపు. ఇది కేవలం రుచికే కాక, ఆహారపదార్థానికి రంగువచ్చేలా చేస్తుంది. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంతేకాక పసుపు వంటకాల్లో వాడటం వెనుక కొందరికి సెంటిమెంట్‌ కూడా వుంది.
4000 ఏళ్ల సంవత్సరాల క్రితం పసుపు వినియోగం గురించి వేదాల్లో రాశారు. అన్ని రకాల భారత వంటకాల్లో తప్పనిసరిగా ఉండేది చిటికెడు పసుపు. ఇది గాయాలను మాన్పుతుందని భావిస్తారు.
మన ఇళ్లల్లో పసుపును శుభప్రదమైనదిగా భావిస్తారు. పెళ్లి కార్డులు పంచేముందు, వీటికి నాలుగువైపుల పసుపు రాసి ఇస్తారు. ఎందు కంటే సంతోషానికి, అదృష్టానికి చిహ్నమని పసుపుపూస్తారు. ఇక ఒడిసాల్లో దీన్ని మరో విధంగా పరిగణిస్తారు. తమ ఆత్మీయులు ఎవరై నా చనిపోతే, పదిరోజులపాటు పసుపు లేకుండా ఆహారాన్ని తీసుకోవడం ఆచారమట. ఆత్మీయు లు కోల్పోయారనడానికి, విషాదానికి గుర్తుగా పసుపులేని ఆహారం తీసుకుంటారు. శాఖాహార మైనా, మాంసాహారమైన పసుపులేని ఆహార పదార్థాలు ఉండవనే చెప్పాలి. ఊరగాయల్లో పసుపు ఒక భాగంగా మారింది. పసుపురంగు పచ్చడికి మంచి రంగును, రుచినీ ఇస్తుంది.
సాధారణ పప్పు వంటకాల్లో చిటికెడు ఉప్పు, పచ్చి మిరపకాయల వల్ల మంచి రుచి వస్తుంది. కిచిడీకి పసుపు రంగు కలపడం ఆనవాయితీ. పసుపు పెరిగే మొక్కను 'హల్దీ' అంటారు. ఇది మన దేశంలో చాలా ప్రాంతాల్లో పెరుగుతుంది. తాజా పసుపు మొక్కలు చిన్న అల్లం మొక్కల్లాగా కనిపిస్తాయి.
వంటల్లోనేకాక పసుపును వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఇందులో 'ఫ్లెవనాయిడ్‌ కుర్కుమిన్‌' ఉంటుంది. దీనికి యాంటి- ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇది కాలేయాన్ని విషరహితంగా చేస్తుంది. అలర్జీలపై పోరాడు తుంది. జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మహిళలు పసుపు ముద్దతో స్నానం చేయడం మన సాంప్రదాయం. పసుపు నూనె వల్ల చర్మరోగాలు కూడా నయమవుతాయి.
బరువును తగ్గించే గుడ్డు !
బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఉదయం టిఫిన్‌లో గుడ్డు తినాలి. గుడ్లు తినడం వల్ల కలిగే ప్రభావాల గురించి అధ్యయనాలు జరిగాయి. వీటిని విశ్లేషించారు. గడ్డులో ఉండే శక్తివంతమైన పదార్థం మధ్యాహ్నం, రాత్రి భోజనం ఎక్కువ కేలరీలు తీసుకోకుండా నిలువరిస్తుందని ఇందులో కనుగొన్నారు. ఇతర పద్ధతుల్లో కాకుండా గుడ్డును ఉడకబెట్టడం, వేయించడం, గిలకొట్టడం వంటి రూపాల్లో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మధ్యాహ్నం ఆకలేసినప్పుడు బిస్కెట్లు, కేకులు, చాక్లెట్లు తినకుండా గుడ్డు నిలువరిస్తుంది. ఈ విశ్లేషణ 'నెట్‌వర్క్‌ హెల్త్‌ డైటీషియన్‌' అనే పత్రికలో ప్రచురితమైంది. ఇతరరకాల కంటే గుడ్డులో ఉండే ప్రత్యేకమైన ప్రోటీన్లు ఆకలి కలగకుండా చేస్తాయని కనుగొన్నారు. ఎనిమిదేళ్లపాటు జరిగిన అధ్యయన ఫలితాలను పోషకాహార నిపుణులు డాక్టర్‌ క్యారీ రక్సటన్‌ పరీక్షించారు. ఉదయం టిఫిన్‌లో తృణధాన్యాలు తీసుకోవడం కన్నా గుడ్డును తినడం వల్ల బరువు గణనీయంగా తగ్గడమేకాక, నడుం భాగంలో కొన్ని అంగుళాలను కోల్పోయారని, సుధీర్ఘకాలం పాటు జరిగిన అధ్యయనం వెల్లడించింది. 'గుడ్డు

వల్ల కలిగే సుదీర్ఘ ప్రయోజనాల గురించి మరింత పరిశోధన చేయాల్సి ఉంది. బరువు తగ్గడంలో గుడ్డు పాత్రను విస్మరించలేమని ఆధారాలు చూపుతున్నాయి' అని డాక్టర్‌ రక్సటన్‌ అంటారు. గుడ్డు వల్ల బరువు తగ్గడమేకాక, అదనంగా మరో రెండు ప్రయోజనాలు న్నాయని రక్సటన్‌ తెలిపారు. ఒక గుడ్డులో 78 కేలరీలు ఉంటాయి. ఇంక రెండోది గుడ్డులో ఉండే విటమిన్‌-డి. స్థూలకాయులకు ఇది ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే స్థూలకాయుల్లో విటమిన్‌-డి తక్కువుంటుంది. ఇది తక్కువ ఉండట వల్ల, మధుమేహం, గుండె జబ్బు ప్రమాదం పెరుగుతుంది. సగటున ఒక గుడ్డులో అత్యధిక ప్రోటీన్లు-6.5 గ్రాములు ఉంటాయి. పెద్ద వాళ్లకు ఒక రోజుకు అవసరమైన ప్రోటీన్లలో ఇది 13 శాతం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి