నడుమునొప్పి గురించి విననివారు, దీని బారిన పడనివారు ఉండరు. ముఖ్యంగా 2/3
మంది 20 సంవత్సరాలు దాటినవారిలో చూస్తాం. ముఖ్యంగా మహిళలలు ఈ నొప్పితో
ఎక్కువగా బాధపడతారు. వారి జీవనవిధానం ప్రెగ్నెన్సీ, డెలివరీ ఇంటి పనులు
తీవ్రతను పెంచుతాయి.
డాక్టరు దగ్గరికి వెళ్ళేవారిలో ప్రతి ముగ్గురిలో స్త్రీలు ఒకరు తప్పక
ఉంటారు. పనిచేయలేకపోతారు. దీనికి విశ్రాంతి అవసరం. అందువలన స్త్రీలు ఈ
కారణంగా సెలవు తీసుకుంటారు. అధికంగా పనిదినాలు దీనివలనే వృధా అవుతుంటాయి.
నడుమునొప్పి వ్యాధి కాదు. వ్యాధి యొక్క లక్షణాలు మాత్రమే. ఇది చాలా
వ్యాధులలో సర్వసాధారణంగా కనబడుతుంది. చిన్న జ్వరం నుండి బాధించే ప్యాసెట్
సైనొవియల్ సిస్ట్ (facet synovial cyst).
నడుమునొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. శరీరశ్రమ, పనిఒత్తిడి, మానసిక
ఆందోళనలు కూడా కారణం అవుతాయి. మనం ఈ నొప్పిని మూడు విధాలుగా
విభజించవచ్చును. సిస్టమ్ డిసీస్, స్ట్రెస్, టెన్షన్ వలన లేదా న్యూరలాజికల్
ప్రాబ్లమ్ వలన సామాన్యంగా నొప్పితో బాధపడే ప్రతి 10 మందిలో, ఆరుగురు
నడుంనొప్పితో బాధపడుతున్నవారే.
సన్నని నొప్పి, ఆగకుండా కలిగే నొప్పి, ఉప్పెన మాదిరిగా వచ్చే నొప్పి,
కూర్చుంటే కలిగే నొప్పి, టూవీలర్ నడిపితే కలిగే నొప్పి, గృహిణిలకు పనివలన
కలిగే నొప్పి, పెద్దవారికి టీవీ చూస్తే నొప్పి, స్కూలు పిల్లలకు బ్యాగులు
మోసి (బుక్స్) నొప్పి, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కూర్చుంటే నొప్పి,
వ్యాపారులకు, ఉద్యోగులకు, రాజకీయనాయకులకు, రైతులకు పొలాలలో నొప్పి,
నాట్యకళాకారులకు నాట్యంలో నొప్పి, వృద్ధులకు పడుకుంటే నొప్పి... అందరినీ
భాదించే నొప్పి నడుమునొప్పి.
వివిధ కారణాలు
స్వల్పకాలిక నొప్పి, కొన్ని రోజులు, కొన్ని వారాలు ఉండే నొప్పి ముఖ్యంగా
గాయాలు, వెన్నుపూస వాపు, కండరాల శ్రమ, ఆటలలో గాయాలు, అలసట, తోటలో పనిచేయడం,
బరువులు ఎత్తటం, నొప్పి, ఆకస్మాత్తుగా తీవ్రంగా పొడిచినట్లుగా ఉంటుంది.
కదలికలలో నిర్బంధం. ఫ్రీగా తిరగలేరు. కండరాలు పట్టివేసినట్లు ఉంటుంది. నిటారుగా నిలబడలేరు. చక్కగా పడుకోలేరు.
దీర్ఘకాలిక నొప్పి: మూడు నెలల కంటే ఎక్కువైతే కారణాలు వేరుగా ఉంటాయి.
వివిధరకాలుగా ఈ నొప్పి వివిధ భాగాలలో ఉంటుంది. వెన్నుపూసలో మార్పుల వలన
వచ్చే నొప్పులు.
డిస్క్ (వెన్నుపూస) సమస్యలు - డిస్క్ హెర్నియేషన్
డిస్క్ బల్జ్ (వాపు) - డిస్క్ ప్రాలాప్స్ (పక్కకు జరుగుట)
నర్వ్ కంప్రెషన్ - కెనాల్ నారోయింగ్
డిస్క్ లైసిస్ - డిస్క్ ట్రోమ
డిస్క్ ఫ్రాక్చర్స్ - డిస్క్ సిండ్రోమ్స్
స్పైనల్ టీబీ - ఆస్టియో పోరోసిస్
డిస్క్‌వాపు, - ఆర్ట్రైటిస్
డిస్క్ (వెన్నుపూస) వాపు, పక్కకు జరుగటం... వంటి వాటికి కలిగే బాధలు:
వెన్నుపూసల మధ్యన ఉండే జిగురుపదార్థం తగ్గి పక్కకు జరుగుతుంది. అప్పుడు
నడుమునొప్పి పిరుదుల నుండి కాళ్ళ వరకు పాకుతుంది. మెడనొప్పి, భుజాలు,
చేతులు తిమ్మిర్లెక్కి, మొద్దుబారిపోవటం, కండరాల పట్టు తగ్గుటం, వణకటం
చూస్తాం.
రోగ నిర్ధారణ
ఎక్స్-రే
ఎమ్‌ఆర్‌ఐ
సీటీ స్కాన్
హోమియో చికిత్స
హోమియో వైద్యం ద్వారా కండరాల, కీళ్ళ, నరాల సంబంధ వ్యాధులకు స్టార్ హోమియోపతిలో నవీన చికిత్స కనుగొనబడింది.
నూతన పరిశోధన ఫలితాలను అనుసరించి శారీరక, మానసిక విశ్లేషణ, కారణం, రోగ
లక్షణాలు, మూలకారణాలు... వీటిని బట్టి హోమియో మందులు సూచింపబడును.
వాడదగిన హోమియో మందులు
రస్టాక్స్: కండరాల, కీళ్ళ నొప్పులు, కదలికలలో నిర్బంధు (స్టిఫ్‌నెస్) చల్లటి గాలి వలన, తేమ వలన వచ్చేనొప్పి, నడుమునొప్పి, కీళ్ళ నొప్పులు.
కార్నికం: గాయాలు, బెణుకుట... వలన కలిగే నొప్పి, జ్వరం, కీళ్ళ నొప్పులు వాపు, నడకతో పెరిగే నొప్పులు.
సిమిసిప్యూగా: స్త్రీల సంబంధ నొప్పులు, మెన్సెస్ టైమ్‌లో పెరిగే నొప్పులు, వాతావరణ మార్పుల వలన కలిగే నొప్పులు.
కాస్టకమ్: కండరాల పటుత్వం, నిర్బంధం, కీళ్ళ వాపు, కండరాల క్షీణత, ఎక్కువ చలి, వేడి పడదు. నడకతో పెరిగే నొప్పి.
అకొనైట్: ఉప్పెనలాంటి నొప్పులు, భయం, ఆందోళన విపరీతమైన నొప్పి, ప్రాణభయం, నరాల సంబంధ నొప్పులు.
బెల్లడొనా: కీళ్ళ వాపు, కండరాల నొప్పి, తీవ్రంగా, సడెన్‌గా వచ్చే నొప్పి, జ్వరం కండరాలు పట్టేయటం, స్పాజెర్స్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి