26, సెప్టెంబర్ 2013, గురువారం

బరువు తగ్గాలంటే నిలబడండి..!


స్థూలకాయులకు ఒక శుభవార్త. బరువు తగ్గాలంటే ఇకపై బరువులు మోయనక్కరలేదు అంటున్నారు పరిశోధకులు. ఆఫీసుల్లో పనిచేసుకుంటూ కూడా బరువు తగ్గవచ్చట. కానీ ఆఫీసు పనులే నిలబడి చేస్తే చాలు, బరువు తగ్గడం మొదలవు తుందని అంటున్నారు. ప్రతిరోజూ మూడు గంటల పాటు నిలబడి పనిచేస్తే సుమారు నాలుగు కిలోల బరువు తగ్గే అవకాశం ఉందట! అంతే కాకుండా కూర్చుని పనిచేసే వారికంటే ఇలా నిలబడి పనిచేసేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారట! మూడుగంటల పాటు నిలబడితే దాదాపు 150 కాలరీలు ఖర్చవుతాయి. ఏదోరకంగా కాలరీలు ఖర్చు చేయడమే మనకు మంచిది కదా!.

1 కామెంట్‌:

  1. ఆఫీసు పనులే నిలబడి చేస్తే చాలు, బరువు తగ్గడం మొదలవు తుందని అంటున్నారు. ప్రతిరోజూ మూడు గంటల పాటు నిలబడి పనిచేస్తే సుమారు నాలుగు కిలోల బరువు తగ్గే అవకాశం ఉందట!

    రిప్లయితొలగించండి